ఉత్తమ నటి ఆస్కార్ చోరీ

First Published 6, Mar 2018, 2:09 PM IST
oscar winner frances award stolen
Highlights
  • లాస్ ఏంజిల్స్ లో వైభవంగా ఆస్కార్ ప్రదానోత్సవం
  • ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్ డార్మండ్
  • అవార్డు అందుకున్న కాసేపటికే ఉత్తమ నటి ఆస్కార్ చోరీ

90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం (మార్చి 5) అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటిగా ఫ్రాన్సెస్ మెక్ డార్మండ్, ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్ మ్యాన్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. అయితే.. ఆస్కార్ అందుకున్న కాసేపటికే నటి ఫ్రాన్సెస్ అవార్డు చోరీకి గురైంది.టెర్రీ బ్రయాంట్ అనే 47 ఏళ్ల వ్యక్తి ఫ్రాన్సెస్ అవార్డును చోరీ చేశాడు. కేవలం ట్రోఫీని కొట్టేయడానికే టెర్రీ టికెట్ కొనుక్కుని మరీ వేడుకకు హాజయ్యాడు. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్ పోలీసులు నిందితుణ్ని పట్టుకొని అవార్డును స్వాధీనం చేసుకున్నారు. ఫ్రాన్సెస్ కు అందజేశారు.

 


‘త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ’ అనే సినిమాకుగాను ఫ్రాన్సెస్ ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకుంది. అవార్డు అందుకున్న కాసేపటికే ఆ ట్రోఫీ చోరీకి గురవడంతో ఫ్రాన్సెస్ కన్నీరుమున్నీరైంది. పోలీసులు సకాలంలో స్పందించి ట్రోఫీని తిరిగి స్వాధీనం చేసుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది. వారికి ధన్యవాదాలు తెలిపింది.

loader