Asianet News TeluguAsianet News Telugu

ఆస్కార్‌ సినిమా `పారాసైట్‌` నటుడు ఆత్మహత్య.. కారులో డెడ్‌ బాడీ గుర్తింపు..

ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ `పారాసైట్‌`లో అద్బుతమైన నటనతో మెప్పించిన సౌత్‌ కొరియన్‌ నటుడు లీ సన్  క్యూన్‌ కన్నుమూశారు. ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

oscar movie parasite actor suicide dead body found in car arj
Author
First Published Dec 27, 2023, 10:21 AM IST

ఆస్కార్‌ సినిమా  `పారాసైట్‌` నటుడు లీ సన్‌ క్యూన్‌ (48) కన్నుమూశారు. సౌత్‌ కొరియాకి చెందిన లీ సన్..  బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. సౌత్‌ కొరియా రాజధాని సీయోల్‌ నగరంలో ఓ పార్క్ లో తన ఆయన డెడ్‌ బాడీని పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఇంట్లో సూసైడ్‌ నోట్‌ దొరకడంతో లీ సన్‌ ది ఆత్మహత్యగా నిర్థారించారు. ఆయన నటించిన `పారాసైట్‌` సినిమా 2019లో ఆస్కార్‌ అవార్డుని సాధించింది. ఇందులో ఒక మెయిన్‌ లీడ్‌గా లీ సన్ క్యూన్‌ నటించారు. 

లీ సన్‌.. ఇటీవల  కాలంలో బాగా వార్తల్లో నిలిచారు. అక్రమంగా డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన విచారణ ఫేస్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం బాధాకరం. లీ సన్‌ ఇటీవల నైట్‌ క్లబ్ లో డ్రగ్స్ ని తీసుకున్నారని, డ్రగ్స్ దొరికినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఇంతలోనే ఆయన మరణ వార్త అభిమాన లోకాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. 

పార్క్ లో కారులో తన భర్త లీ సన్‌ని చూసిన భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అంతకు ముందే లీ రాసిన సూసైడ్‌ నోట్‌ని తన భార్య ఇంట్లో గుర్తించింది. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లాక ఈ నోట్‌ తనకు దొరికిందని ఆమె వెల్లడించింది. ఇంట్లో సూసైడ్‌ నోట్‌ రాసి, ఆ తర్వాత బయటకు వెళ్లి కారులో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సౌత్‌ కొరియాకి చెందిన లీ సన్ క్యూన్‌.. అక్కడ స్టార్‌ యాక్టర్‌గా రాణిస్తున్నారు. ఆయన 1975 మార్చి 2న జన్మించారు. స్టేజ్‌ యాక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. 2000లో `సైకో డ్రామా` అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత `మేక్‌ ఇట్‌ బిగ్‌` చిత్రంతో సిల్వర్‌ స్క్రీన్‌పైకి అడుగుపెట్టాడు. `సెంట్‌ ఆఫ్‌ లవ్‌`, `మై మదర్‌ ది మెర్మైడ్‌`, `లవ్‌ సో డివైన్‌`, `ఆర్‌ పాయింట్‌`, `అవర్‌ టౌన్‌`, `నైట్‌ అండ్‌ డే`, `సా కా`, `రొమాంటిక్‌ ఐలాండ్‌`, `పాజు`, `పెట్టీ రొమాన్స్`, `హెల్ప్ లెస్‌` చిత్రాలు చేశారు. 

`హెల్ప్ లెస్‌` మూవీ నటుడిగా బ్రేక్‌ ఇచ్చింది. `ఆల్‌ ఎబౌట్‌ మై వైఫ్‌` సినిమా పెద్ద విజయం సాధించింది. `నో బడీ డాటర్‌ హవాన్‌`, `ఏ హార్డ్ డే`, `ది అడ్వోకేట్‌ః ఏ మిస్సింగ్‌ బాడీ`, `ది కింగ్స్ కేస్‌ నోట్‌`, `మ్యాన్‌ ఆఫ్‌ విల్‌`, `ఏ స్పెషల్‌ లేడీ`, `టేక్‌ పాయింట్‌`, `పారాసైట్‌`, `కింగ్‌ మేకర్‌`, `కిల్లింగ్‌ రొమాన్స్`, `స్లీప్‌` వంటి చిత్రాలు చేశారు. `పారాసైటమ్‌` మూవీ 2019 లో ఆరు విభాగాల్లో ఆస్కార్‌ కి పోటీ పడింది. నాలుగు అవార్డులను గెలుచుకుని సంచలనం సృష్టించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios