96వ ఆస్కార్స్ ఘనంగా ముగిశాయి. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సత్తా చాటింది. బార్బీతో పాటు మరికొన్ని చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్ వివిధ విభాగాల్లో గెలుపొందాయి. మరి ఆస్కార్ గెలిచిన చిత్రాల ఓటీటీ డిటైల్స్ చూద్దాం..  

ప్రపంచ సినిమా వేదిక ఆస్కార్స్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు గెలవాలని ప్రతి నటుడు, టెక్నీషియన్ కోరుకుంటాడు. ఏళ్ల తరబడి పరిశ్రమలో ఉన్నా కొందరి ఆస్కార్ అందని ద్రాక్షే. కాగా 96వ ఆస్కార్ వేడుకలు ముగిశాయి. ఊహించిన విధంగానే అనేక విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్న ఓపెన్ హైమర్ సత్తా చాటింది. ఏకంగా 7 ఆస్కార్స్ గెలుచుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్ తో పాటు మరో ఐదు విభాగాల్లో ఓపెన్ హైమర్ ఆస్కార్స్ పొందింది. 

నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ లో నటనకు గానూ ఆస్కార్ గెలుపొందాడు. అలాగే దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మొదటిసారి అదే చిత్రానికి ఆస్కార్ అందుకున్నారు. ది పూర్ థింగ్స్, ది హోల్డోవర్, బార్బీ, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ వంటి చిత్రాలు ఆస్కార్ గెలిచిన చిత్రాల జాబితాలో ఉన్నాయి. 

ఈ ఏడాది ఆస్కార్ గెలుచుకున్న చిత్రాలను ఓటీటీలో ఎక్కడ చుడొచ్చో తెలుసుకుందాం. అత్యంత ఎక్కువగా మాట్లాడుకున్న ఓపెన్ హైమర్ జీ తెలుగులో అందుబాటులో ఉంది. రెంట్ బేసిస్ మీద అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. ఇక బార్బీ మూవీ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. పూర్ థింగ్స్ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ హాట్ స్టార్ లో చూడొచ్చు. ది హోల్డోవర్స్ మూవీ అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. 

అనాటమీ ఆఫ్ ఏ ఫాల్, అమెరికన్ ఫిక్షన్, 20 డేస్ ఇన్ మారియపోల్ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. గాడ్జిల్లా మైనస్ వన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ చిత్రాలను అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీలో చూడొచ్చు.