Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో రికార్డ్ స్టార్ట్ కి అంతా రెడీ.. ఈ పాత్ర కోసం భగవద్గీత చదివా, 'ఓపెన్ హైమర్' నటుడు కామెంట్స్

అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

oppenheimer actor cillian murphy about bhagavad gita dtr
Author
First Published Jul 18, 2023, 8:33 AM IST

ప్రపంచంలో ప్రఖ్యాత మాస్టర్ స్టోరీ టెల్లర్స్ లో క్రిస్టఫర్ నోలెన్ ఒకరు. నోలెన్ చివరగా టెనెట్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన అత్యంత ఆసక్తికరమైన బయోగ్రఫీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై రెండు అణు బాంబులు పడ్డాయి. దీనితో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తున్నారు. 

ఓపెన్ హైమర్ అణుబాంబు పితామహుడిగా పేరుగాంచారు. ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు సృష్టించింది ఆయనే. ఒక మహా ప్రాజెక్టు లాగా ఓపెన్ హైమర్ కి అణుబాంబుని తయారు చేసే బాధ్యత అప్పగించారు. ఆ సమయంలో ఓపెన్ హైమర్ లో ఎలాంటి అంతర్మధనం జరిగింది.. ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉండేవి.. ప్రజల ప్రాణాల గురించి ఆయన ఆలోచించారా ? ఇలాంటి అంశాలన్నీ ఎమోషనల్ గా ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. జూలై 21 ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. 

సిల్లియన్ మర్ఫీ ఈ చిత్రంలో ఓపెన్ హైమర్ పాత్ర పోషిస్తున్నారు. మర్ఫీ ఆ పాత్రలో ఒదిగిపోయి కనిపించాడు. ప్రపంచం మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సిల్లియన్ మర్ఫీ భగవద్గీతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ హైమర్ పాత్ర పోషించేందుకు మానసికంగా సిద్ధం కావాలి. అందుకోసం తాను భగవద్గీత చదివినట్లు మర్ఫీ తెలిపారు. 

oppenheimer actor cillian murphy about bhagavad gita dtr

భగవద్గీత చదువుతుంటే నాకు ఎంతో ఇన్సిపిరేషనల్ గా అనిపించింది. అసలు మర్ఫీ మానసికంగా సిద్ధం అయ్యేందుకు భగవద్గీతనే ఎందుకు ఎంచుకున్నారు.. ఈ చిత్రంతో భగవద్గీతకి సంబంధం ఏంటి అనే అనుమానం రావచ్చు.  శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ అణుబాంబుని మొదటిసారి టెస్ట్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది ప్రపంచ వినాశనానికే అని ఆయనకి అర్థం అయ్యింది. ఈ మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు భగవద్గీత చదివారు. 

oppenheimer actor cillian murphy about bhagavad gita dtr

భగవద్గీత శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశాన్ని కూడా ఓపెన్ హైమర్ కోట్ చేశారు. సృష్టించేది నేనే.. నాశనం చేసేది కూడా నేనే.. నీవు నీ కర్తవ్యం మాత్రమే చేయి.. అని ఓపెన్ హైమర్ అప్పట్లో తెలిపారు. ఆ పాత్ర పోషిస్తున్న సిల్లియన్ మర్ఫీ కూడా తాను భగవద్గీత చదివానని చెప్పడం విశేషం. 

భారీ అంచనాలున్న ఓపెన్ హైమర్ చిత్రం ఇండియాలో రికార్డ్ స్టార్ట్ కి సిద్ధం అవుతోంది. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండగా.. ఇప్పటికే పివిఆర్, ఐనాక్స్, సినిపోలీస్ లాంటి ప్రధాన మల్టి ఫ్లెక్స్ లలో 1 లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. ఓపెన్ హైమర్ ఓపెనింగ్స్ అణుబాంబు తరహాలో ఉండబోతున్నాయని అర్థం అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios