ఇండియా మొత్తం ఆస్కార్ అవార్డుల కోసం ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇండియాలో ఆస్కార్ అవార్డులకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి కారణం జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రమే అని చెప్పాలి.

ఇండియా మొత్తం ఆస్కార్ అవార్డుల కోసం ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇండియాలో ఆస్కార్ అవార్డులకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి కారణం జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రమే అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాలు కొల్లగొడుతూ.. అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటూ ఆస్కార్స్ వరకు చేరింది. 

నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఫైనల్ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంకొక్క అడుగు విజయవంతగా పడితే తెలుగు వాడు ఆస్కార్ అవార్డుని ముద్దాడవచ్చు. ఇప్పటికే రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని అతర్జాతీయంగా తీసుకెళ్లారు. ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంటే.. ఇది తెలుగు వాడి సత్తా అని ప్రపంచం మొత్తం ఎలుగెత్తి చాటవచ్చు. మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజిల్స్ లో జరగనుంది. 

ఈ నేపథ్యంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుస్తుందా ? లేదా ? అంటూ ఆన్లైన్ బెట్టింగ్ షురూ అయినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ వేదికగా కోట్లలో నగదు చేతులు మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బెట్టింగ్ బుకీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ లో టాలీవుడ్ నుంచి కకొందరు సెలెబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సాధారణంగా ఐపీఎల్ సీజన్, కీలకమైన క్రికెట్ మ్యాచ్ లు జరుగుతునప్పుడు ఈ తరహాలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతూ ఉంటుంది. అంతకి మించేలా ఆర్ఆర్ఆర్ చిత్రంపై బెట్టింగ్ రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. 1:2, 1:3, 1: 4 నిష్పత్తిలో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఆర్ఆర్ఆర్ చిత్రానికి పోటీగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో టాప్ గన్ మెవెరిక్, బ్లాక్ పాంథర్ లాంటి హాలీవుడ్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఆల్రెడీ నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది. ఆస్కార్ ని కూడా సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

నాటు నాటు చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్, రాంచరణ్ కళ్ళు చెదిరే విధంగా పర్ఫెక్ట్ సింక్ తో డ్యాన్స్ చేసి అలరించారు.