నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఈ సినిమా తరువాత నాని ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంపై పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే నాని.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా నానితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు క్యూ కట్టారు. వీరిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు శివ నిర్వాణ.. నాని తదుపరి సినిమా శివ నిర్వాణతో ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

కానీ నిజానికి ఇప్పటివరకు నాని ఏ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు దర్శకులు నాని కూడా వెయిట్ చేస్తున్నారట. వాళ్లలో శివ నిర్వాణ కూడా వున్నారు.

సుధీర్ వర్మ, రాహుల్ రవీంద్రన్, తమిళ దర్ళకుడు వినోద్, హను రాఘవపూడి, ఇంకో మరో ఒకరిద్దరు కూడా లైన్ లో వున్నారని సమాచారం. ప్రస్తుతం అమెరికా వెళ్లిన నాని తిరిగి వచ్చిన తరువాత వీరిలో ఏ డైరెక్టర్ కి ఓకే చెబుతాడనేది ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది.