సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో మలుపు, గంటకో అప్డేట్. దేశం మొత్తం ఈ కేసుపై ఫోకస్ పెట్టగా ఒక్కొక్కటిగా నిజాలు బయటికి వస్తున్నాయి. సుప్రీం కోర్ట్ ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ కేసు విచారణపై పూర్తి దృష్టి సారించింది. సుశాంత్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తున్నారు. తాజాగా ఓ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కవితా దేశ్వాల్ అనే ఓ మహిళ సంచలన ట్వీట్ పోస్ట్ చేశారు. ఆమె ఆ ట్వీట్ లో సుశాంత్ మరణానికి ముందు వరుసగా ఆయన సన్నిహితులు మరణించినట్లు తెలిపింది. 

కవిత దేశ్వాల్ తన ట్వీట్ లో మే 15న సుశాంత్ కి బాగా సన్నిహితుడు అయిన మన్మీత్ గ్రీవాల్ ఉరి వేసుకొని మరణించాడు. మే 26న శుశాంత్ ఫ్రెండ్ అయిన ప్రేక్ష మెహతా కూడా ఉరి వేసుకొని మరణించడం జరిగింది. మే 31న సుశాంత్ మరో స్నేహితుడు క్రిష్ కపూర్ మరణించడం జరిగింది. జూన్ 8న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణించింది. ఇది ఎలా సాధ్యం అవుతుందని ఆమె చెప్పడం జరిగింది. దీనితో ఈ కేసులో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. 

కవితా దేస్వాల్ చెవుతున్నట్లుగా వారందరూ సుశాంత్ కి సన్నిహితులేనా అని తెలుసుకోవాల్సి వుంది. అదే నిజమైతే సుశాంత్ మరణం వెనుక పెద్ద కుట్ర కోణం ఉన్నట్లే. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కేసులో ముద్దాయిగా సుశాంత్ లవర్ గా ఉన్న రియా చక్రవర్తి ఉన్నారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను కేసులో ముద్దాయిలుగా చేర్చారు. సీబీఐ విచారణలో సుశాంత్ మరణం వెనుక నిజాలు తెలుస్తాయని అందరూ భావిస్తున్నారు.