Asianet News TeluguAsianet News Telugu

కల్కి టీమ్ నుండి అనుకోని సర్ప్రైజ్... భైరవ వాహనం బుజ్జిని చూస్తారా?

ఒక్కో అప్డేట్ కల్కి 2829 AD పై అంచనాలు పెంచేస్తుంది. తాజాగా కల్కి లో హీరో ప్రభాస్ ఉపయోగించే వాహనాన్ని పరిచయం చేయబోతున్నారు. 
 

one more surprising update from prabhas kalki 2829 ad movie ksr
Author
First Published May 17, 2024, 8:09 PM IST

దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో గొప్పగానే ప్లాన్ చేశాడు. కల్కి 2829 AD చిత్రం నుండి వస్తున్న ఒక్కో పోస్టర్, అప్డేట్ అంచనాలు పెంచేస్తున్నాయి. కల్కి చిత్రీకరణకు నాగ్ అశ్విన్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడాడు. కల్కి మూవీలో కనిపించే వాహనాలు, వస్తువులు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయట. కల్కి మూవీలో వాడే వాహనాలకు టెక్నాలజీ విషయంలో సహాయం అందించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నాగ్ అశ్విన్ అడిగారు. 

కాగా కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అట. ఆయన ఓ ప్రత్యేక వాహనం వాడుతారట. దాని పేరు బుజ్జి కాగా... దాన్ని ప్రేక్షకులకులు పరిచయం చేయనున్నారట. ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. మే 18 సాయంత్రం 5:00 గంటలకు భైరవకు చెందిన బుజ్జిని పరిచయం చేస్తామని యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ అప్డేట్ కి సంబంధించిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. కల్కి చిత్రంతో ప్రేక్షకులను నాగ్ అశ్విన్ ఫ్యూచర్ లోకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో వాహనాలు కూడా భవిష్యత్ పరిస్థితులను అంచనా వేసి డిజైన్ చేసినట్లు సమాచారం. 

ఇక కల్కి జూన్ 27న విడుదల కానుంది. ప్రభాస్ కి జంటగా దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్ర చేస్తున్నారు. కమల్ హాసన్ సైతం ఈ చిత్రంలో భాగం అయ్యారు. ఆయన పాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. వైజయంతీ పిక్చర్స్ బ్యానర్ లో అశ్వినీ దత్ కల్కి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక దేశవ్యాప్తంగా నాలుగు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారట. మే 22 నుంచి ఈ వేడుకలు మొదలు కానున్నాయట. ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ ఈ ఈవెంట్స్ లో పాల్గొననున్నారని సమాచారం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios