Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ తో తలపడిన మాస్ మహరాజ్... పూనకాలు తెప్పిస్తున్న పోస్టర్!

సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో భారీగా ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి చిత్రాలు ప్రధానంగా తలపడనున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి-బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 
 

one more song to release from waltair veerayya here is details
Author
First Published Dec 29, 2022, 4:23 PM IST

చిరంజీవి 2023 సంక్రాంతి పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సంక్రాంతి బరిలో భారీ హిట్ కొట్టాలని నిశ్చయించుకున్నాడు. బాలయ్య, విజయ్ చిత్రాల నుండి ఆయనకు పోటీ ఎదురుగానున్న నేపథ్యంలో వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్స్ గట్టిగా నిర్వహిస్తున్నారు. విడుదలకు రెండు వారాల ముందే ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సాంగ్ విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మూడు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. 

డిసెంబర్ 30న నాలుగో సాంగ్ విడుదల చేస్తున్నారు. మెగాస్టార్ వర్సెస్ మాస్ మహరాజ్ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల చేశారు.  వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి-రవితేజ అన్నదమ్ములని, వీరి మధ్య భీకర పోరు నడుస్తోందన్న ప్రచారం జరుగుతుండగా తాజా పోస్టర్... ఆ పుకార్లకు బలం చేకూర్చేదిగా ఉంది. రవితేజ ఈ చిత్రంలో విక్రమ్ సాగర్ ఏసీపీ రోల్ చేస్తున్నారు. ఆయన ఇంట్రో వీడియో అదిరిపోయింది. 

డిసెంబర్ 30న విడుదల కానున్న సాంగ్ రవితేజ, చిరంజీవిలపై తెరకెక్కిందని తెలుస్తుంది. దేవిశ్రీ కసిగా వాల్తేరు వీరయ్య సాంగ్స్ కంపోజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయడం విశేషం. చిరంజీవి గత చిత్రం గాడ్ ఫాదర్ సైతం హిందీలో రిలీజ్ చేశారు. సల్మాన్ కీలక రోల్ చేసినప్పటికీ గాడ్ ఫాదర్ చిత్రానికి అక్కడ ఆదరణ దక్కలేదు. అయినప్పటికీ వాల్తేరు మూవీపై ఉన్న నమ్మకంతో నార్త్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. జనవరి 13న వాల్తేరు వీరయ్య వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios