దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఈ కాంట్రవర్సీ దర్శకుడు చేస్తున్న మరో చిత్రం వ్యూహం. ఈ చిత్రం నుండి వస్తున్న ఒక్కో స్టిల్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉంది.  

దర్శకుడు వర్మ వ్యూహం టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఇది వై ఎస్ జగన్ బయోపిక్. ఆయన్ని రెండు సార్లు కలిసిన వర్మ వ్యూహం మూవీ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. వ్యూహం మూవీలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని వర్మ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను చూపించారు. వ్యూహం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 

తాజాగా వర్మ మరో కాంట్రవర్సియల్ స్టిల్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తో కూడిన సదరు ఫోటో పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టేదిగా ఉంది. పవన్ ని పోలిక ఒక వ్యక్తి నేలపై పడుకొని గాలిలో లెక్కలు వేస్తున్నాడు. తెల్లని వస్త్రాలు, మెడలో ఎర్ర కండువాతో ఉన్న సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని పోలిన పాత్రతో కూడిన ఫోటోలు, పోస్టర్స్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. 

Scroll to load tweet…

ఇక వర్మ ట్విట్టర్ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు మండి పడుతున్నారు. కామెంట్స్ సెక్షన్ లో దుమ్మెత్తి పోస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వర్మ తీరు అంతే. చేయాలనుకున్నది చేసేస్తాడు. వ్యూహం మూవీతో ఎంత పెద్ద కాంట్రవర్సీకి వర్మ కారణం కానున్నాడో చూడాలి. 

కాగా వర్మ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆర్జీవీ డెన్ అని దానికి పేరు పెట్టాడు. ఆర్జీవీ డెన్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. తనను డైరెక్టర్ గా పరిచయం చేసిన నాగార్జున ఫోటోతో పాటు తనకు ఇష్టమైన యాక్టర్స్ అమితాబ్, శ్రీదేవి ఫోటోలను,తన చిత్రాల వర్కింగ్ స్టిల్స్ తో ఆఫీస్ నింపేశాడు. ప్రస్తుతం వర్మ అమెరికా పర్యటనలో ఉన్నారు. డల్లాస్, లాస్ వేగాస్ వంటి నగరాల్లో చక్కర్లు కొట్టాడు. పబ్స్ లో ఎంజాయ్ చేశాడు. వర్మ సరదా లైఫ్ చూసి కొందరు నెటిజెన్స్ కుళ్ళుకున్నారు.