బాహుబలి తరువాత రాజమౌళి ఇమేజ్ దేశ సరిహద్దులు కూడా దాటిపోగా, ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భాషలతో, పరిశ్రమలతో సంబంధం లేకుండా దేశం మొత్తం ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ కూడా కావడం, మరింత ఆకర్షణ తీసుకువచ్చింది.  అనేక కారణాల వలన ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు అక్టోబర్ 13వ తేదీన ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. 

ఇక ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన నాటి నుండి ఏదో రూపంలో లీకులు జరుగుతున్నాయి. తాజాగా ఆర్ ఆర్ ఆర్ సెట్స్ నుండి ఓ పిల్లాడి ఫోటో బయటికి వచ్చింది. తలకు కండువా, పంచె కట్టుకొని ఉన్న ఓ పిల్లాడి ఫోటో ఆసక్తి రేపుతోంది. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ధృవన్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ పోస్ట్ పెట్టడంతో పాటు, అది ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లోని ఫోటో అంటూ వివరణ ఇచ్చాడు. 

బ్లాక్ అండ్ వైట్ లో ఆసక్తిరేపుతున్న ఆ ఫోటోని చూసిన నెటిజెన్స్ తమ బుర్రలకు పదునుపెట్టి, ఊహలకు తెరలేపారు.  పిల్లాడి ఫోటో చూసిన కొందరు ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీమ్ చిన్ననాటి పాత్ర అని కొందరు అంటుంటే.. కాదు అది అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్ చిన్ననాటి పాత్ర ఫోటో అంటూ అభిప్రాయం తెలియజేస్తున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.