ఒకరు కొంటే ఒకరికి ఫ్రీ.. `నరకాసుర` టీమ్ బంపర్ ఆఫర్
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన `నరకాసుర` చిత్ర బృందం ఓ క్రేజీ ఆఫర్‌ని ప్రకటించింది. ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించేందుకు బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది.

సినిమాని ఆడియెన్స్ చూసేందుకు, సినిమాకి ఆడియెన్స్ ని రప్పించేందుకు నిర్మాతలు అనేక పాట్లు పడుతుంటారు. టికెట్ రేట్లు తగ్గించడం, ఆడవాళ్లకి ఫ్రీగా ప్రదర్శించడం వంటివి చేస్తుంటారు. ముందుగానే సినిమాని ఆడియెన్స్ కి ప్రదర్శిస్తూ మౌత్ పబ్లిసిటీ చేస్తుంటారు. కానీ `నరకాసుర` టీమ్ సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతుంది. ఒకటి కొంటే మరోటి ఫ్రీ అనే ఆఫర్‌ని సినిమాకి అప్లై చేస్తుంది. ఒక్క టికెట్ కొంటే ఒకరు ఫ్రీగా సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది.
`పలాస` వంటి చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి తాజాగా `నరకాసుర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. సెబాస్టియన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. థియేటర్ల వద్ద మిశ్రమ స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్ కి బంపర ఆఫర్ ప్రకటించారు. సోమవారం నుంచి ఒక్క టికెట్ కొంటే మరొకరు ఫ్రీగా సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. సోమవారం, గురువారం వరకు నాలుగు రోజులపాటు ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించింది.
ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ , `నరకాసుర` సినిమాకు థియేటర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు. ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి అప్రిషియేషన్స్ తో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి థర్స్ డే వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం. "నరకాసుర" వంటి మంచి సినిమాను థియేటర్స్ లో చూడండి, ఈ ప్రయత్నంలో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నా` అని అన్నారు.
దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ , `మా `నరకాసుర` సినిమాను పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. సినిమా చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా రివ్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. కొందరు పర్సనల్ గా నాకు సినిమా ఆకట్టుకుందని మెసేజ్ లు పంపుతున్నారు. సినిమా బాగుందని చెప్పడమే కాదు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ఫైట్స్..ఇలా ప్రతి క్రాఫ్ట్ వర్క్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది` అని తెలిపారు.
నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ, `నరకాసుర` మూవీతో మా బ్యానర్ సుముఖ క్రియేషన్స్ కు మంచి పేరొచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. విదేశాల నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. రక్షిత్ తో పాటు హీరోయిన్స్, ఇతర కీ ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుందని అభినందిస్తున్నారు. "నరకాసుర" చూడని వాళ్లు థియేటర్స్ కు వెళ్లండి, ఈ సినిమాలోని మంచి మెసేజ్ ను ఇతరులకు చెప్పండి. మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా చేసిన డైరెక్టర్ సెబాస్టియన్ గారికి థ్యాంక్స్` అని వెల్లడించారు.