ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సెన్సిబుల్ అండ్ పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రభాస్ బర్త్ డే కానుకగా విడుదలైన  మోషన్ పోస్టర్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటి మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ కీలక రోల్ చేస్తున్నారు. 

ఈ హీరోయిన్ ప్రభాస్ పై ప్రశంశలు కురిపిస్తుంది. షూటింగ్ సెట్స్ లో ప్రభాస్ ప్రవర్తన, ఆటిట్యూడ్ గ్రేట్ అంటుంది. త్వరగా స్నేహితుడిగా మారిపోయే ప్రభాస్ భాగ్యశ్రీ కోసం హైదరాబాద్ స్వీట్స్ ప్రత్యేకంగా తీసుకెళ్లేవారట. భాగ్యశ్రీ కోసం 15 రకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేశాడట. మైనే ప్యార్ కియా మూవీ సమయంలో నువ్వంటే నాకు క్రష్ ఉండేదని ప్రభాస్ ఆమెతో చెప్పాడట. తాజా కార్యక్రమంలో భాగ్యశ్రీ ఈ విషయం తెలియజేశారు. 

1989లో విడుదలైన మైనే ప్యార్ కియా అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ఈ చిత్రం ప్రేమ పావురాలు పేరుతో విడుదలైంది. ఈ మూవీ సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, తెలుగులో కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 

ఇక రాధే శ్యామ్ మూవీలో భాగ్యశ్రీ రోల్ ఏమిటనే విషయంపై స్పష్టత లేదు. పాన్ ఇండియా చిత్రంగా తెరెక్కుతున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. సచిన్ కేడ్కర్, ప్రియదర్శి కీలక పాత్రలలో నటిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.