Asianet News TeluguAsianet News Telugu

సంపూ భేష్... తల్లిదండ్రులను కోల్పోయిన ఆడపిల్లల బాధ్యత తీసుకున్న రియల్ హీరో!

సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహాచారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీనితో వారి సంతానం ఇద్దరు ఆడపిల్లలు అనాధలు అయ్యారు. ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలుసుకొని సంపూర్ణేష్ బాబు స్వయంగా ఆ పిల్లలను కలిశారు.

once again sampoornesh babu shows his kind heart here are details ksr
Author
Hyderabad, First Published Jul 1, 2021, 9:59 AM IST

దానం చేసే గుణం ఉండాలి కానీ ధనవంతుడు కావల్సిన అవసరం లేదు. మాట సాయం కూడా ఒక్కోసారి ఆపదలో ఉన్నవారిని కాపాడుతుంది. అలాంటి మంచి మనసున్న నటులలో సంపూర్ణేష్ బాబు ఒకరు. హీరోగా సంపూర్ణేష్ బాబు ఆదాయం అంతంత మాత్రమే. దాన గుణంలో మాత్రం సంపూ కలియుగ కర్ణుడే అని చెప్పాలి. పరిశ్రమకు వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నా సంపూర్ణేష్ బాబు కూడబెట్టింది ఏమీ లేదు. హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఒక్కడే ఉంటూ... ఖాళీ దొరికినప్పుడు సొంతూరు వెళ్లి భార్య పిల్లలను కలుస్తాడు. 


వచ్చిన కొంచెం డబ్బులైనా దాచిపెట్టుకోవాలనే ఆలోచన సంపూర్ణేష్ బాబుకు ఉండదు. వరదలు, విపత్తుల సమయంలో ప్రభుత్వాలకు తన వంతుగా డబ్బులు దానంగా ఇస్తూ ఉంటాడు. తాజాగా సంపూర్ణేష్ బాబు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దంపతుల పిల్లలకు ఆర్థిక సహాయం చేశారు. అలాగే ఆ పిల్లల చదువు బాధ్యతలు తీసుకున్నారు. 


సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చల్లాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహాచారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకొని మరణించారు. దీనితో వారి సంతానం ఇద్దరు ఆడపిల్లలు అనాధలు అయ్యారు. ఈ విషయం వార్తా పత్రికల ద్వారా తెలుసుకొని సంపూర్ణేష్ బాబు స్వయంగా ఆ పిల్లలను కలిశారు. రూ. 25 వేలు ఆర్ధిక సహాయం చేయడంతో పాటు దర్శక నిర్మాత సాయి రాజేష్ తో కలిసి పిల్లల చదువు బాధ్యత తీసుకుంటున్నట్లు తెలియజేశారు. 


హీరోగా బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు బజారు రౌడీ, క్యాలీఫ్లవర్, పుడింగి నంబర్ వన్ చిత్రాలలో నటిస్తున్నారు. 2019లో విడుదలైన కొబ్బరి మట్ట చిత్రంతో సంపూ హిట్ కొట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios