Asianet News TeluguAsianet News Telugu

నువ్వే కావాలి 'బేబీ' అంటున్న ఆనంద్ దేవరకొండ.. సూపర్ హిట్ కాంబో రిపీట్

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది "బేబి" సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. తనకి కలసి వచ్చిన హీరోయిన్ వైష్ణవిని నువ్వే కావాలి అని ఆనంద్ దేవరకొండ అంటున్నాడు. ఆల్మోస్ట్ బేబీ చిత్ర కాంబినేషన్ లోనే కొత్త చిత్రానికి రంగం సిద్ధం అయింది.

once again anand devarakonda to romance with baby heroine dtr
Author
First Published Oct 20, 2023, 9:38 PM IST

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది "బేబి" సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. తనకి కలసి వచ్చిన హీరోయిన్ వైష్ణవిని నువ్వే కావాలి అని ఆనంద్ దేవరకొండ అంటున్నాడు. ఆల్మోస్ట్ బేబీ చిత్ర కాంబినేషన్ లోనే కొత్త చిత్రానికి రంగం సిద్ధం అయింది. అయితే దర్శకుడు మాత్రమే మారుతున్నారు. ఈసారి కూడా సాయి రాజేష్, ఎస్ కె ఎన్ లే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా 100 కోట్ల గ్రాసింగ్ ప్రొడక్షన్ హౌస్ మాస్ మూవీ మేకర్స్,"కలర్ ఫొటో"తో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న బ్యానర్ అమృతా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

"బేబి" సినిమాను యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రూపొందించి మెగాస్టార్ చిరంజీవి నుంచి సాధారణ ప్రేక్షకుల దాకా అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ కేఎన్ తో కలిసి సాయి రాజేష్ ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు.

నూతన దర్శకుడు రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే సమ్మర్ లో థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య

టెక్నికల్ టీమ్:

డీవోపీ - బాల్ రెడ్డి
మ్యూజిక్ - విజయ్ బుల్గానిన్
ఎడిటింగ్ - విప్లవ్
బ్యానర్స్ - అమృత ప్రొడక్షన్స్,మాస్ మూవీ మేకర్స్,
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా,వంశీ కాక
సహ నిర్మాత: ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు - ఎస్.కే.ఎన్, సాయి రాజేష్
కథ, స్క్రీన్ ప్లే,మాటలు - సాయి రాజేష్
దర్శకత్వం - రవి నంబూరి

Follow Us:
Download App:
  • android
  • ios