మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే వేడుక షురూ అయ్యింది. సాయంత్రం ఆరు గంటలకు రామ్‌చరణ్‌ చిరంజీవి బర్త్ డే కామన్‌డీపీని విడుదల చేసి పుట్టిన రోజు వేడుకలను ప్రారంభించారు. ఇక బ్యాక్‌ టూ బ్యాక్‌ బర్త్ డేకి సంబంధించి అప్‌డేట్స్ తో అభిమానులు రెచ్చిపోతున్నారు. మరోవైపు మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి సర్‌ప్రైజ్‌లు వస్తూనే ఉన్నాయి. 

తాజాగా ఎనభైమంది సెలబ్రిటీలు చిరంజీవి బర్త్ డేకి చెందిన కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇది ఓ వైపు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు చిరుకి బర్త్ డే గిఫ్ట్ అందించారు. చిరంజీవి సినిమాలను, ఆయన కెరీర్‌ ఎదిగిన తీరు, ఆయన వ్యక్తిత్వం వంటి అంశాలను మేళవిస్తూ ఓ ర్యాప్‌ సాంగ్‌ని రూపొందించారు. `మెగా ర్యాప్‌ సాంగ్‌` పేరుతో దీన్ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్‌ సైతం ఉర్రూతలూగిస్తుంది. 

ఇక నాగబాబు తమ అన్నయ్యకి బర్త్ డే విశెష్‌ చెప్పేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతోపాటు చిరుకి చెందిన తెలియని నిజాలు, ఇప్పటి వరకు బయటకు రాని ఫోటోలను కూడా పంచుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపటి సాయంత్రం వరకు చిరు బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి.