Asianet News TeluguAsianet News Telugu

Prabhas Birthday Special : ప్రభాస్ బర్త్ డేకి సర్ ప్రైజ్ గా ‘సలార్’ ట్విటర్ ఎమోజీలు.. ట్రెండింగ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను సందర్బంగా అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ అందింది. ఇప్పటికే అభిమానులకు జన్మదిన వేడుకలను గ్రాండ్ గా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు.
 

On the Occasion of Prabhas Birthday Salaar Got Twitter Emoji NSK
Author
First Published Oct 22, 2023, 10:08 PM IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)కి ఏరేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. ‘బాహుబలి’, ‘సాహో’, ‘ఆదిపురుష్’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రభాస్ రేంజ్ మరింత తారా స్థాయికి చేరుకుంది. దీంతో డార్లింగ్ అప్ కమింగ్ సినిమాలపై మరింత హైప్ ను పెంచాయి.  అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. 

ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘సలార్’ (Salaar Cease Fire)  విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక రేపు డార్లింగ్ పుట్టిన రోజు ఉండటం విశేషం. ఈ సందర్భంగా ‘సలార్’ మూవీ హ్యాష్ టాగ్స్ కు ట్విట్టర్ ఎమోజీలను అనౌన్స్ చేసింది. ప్రభాస్ కటౌట్ హ్యాష్ టాగ్ ల తర్వాత డిస్ల్పై అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డార్లింగ్ బర్త్ డే స్పెషల్ గా ఎక్స్(Twitter)  హ్యాష్ఎమోజీలను ప్రకటించడం విశేషంగా మారింది. 

మరోవైపు ప్రభాస్ అభిమానులు బర్త్ డే సెలబ్రేషన్స్ ను మునుపెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లోని కూకట్ పల్లి దుర్గా పూజా గ్రౌండ్స్ లో  సలార్ ఆయుధ పూజా కట్ అవుట్ ను ఏర్పాటు చేశారు. డార్లింగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 10:30 నిమిషాలకు ప్రభాస్ బిగ్గెస్ట్ కటౌట్ ను లాంచ్ చేయబోతున్నారు. ఈ వేడుకకు డార్లింగ్ అభిమానులందరూ హాజరయ్యారు. 

ఇక ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’తోక్రియేట్ చేసిన సెన్సేషన్ కు ‘సలార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కెట్ లో ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఉంది. డిసెంబర్ 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కు సరిగ్గా రెండు నెలలు ఉంది. హోంబలే ఫిల్మ్స్  నిర్మిస్తోంది. శృతి హాసన్ హీరోయిన్. జగపతి బాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్స్ గా మెప్పించనున్నారు. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios