జాన్వీకపూర్ తన తల్లిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'హ్యాపీ బర్త్ డే అమ్మా.. ఐ లవ్యూ' అని పోస్ట్ చేస్తూ.. శ్రీదేవి నటించిన చివరి సినిమా 'మామ్' లోని ఓ ఫోటో అభిమానులతో పంచుకున్నారు.  

నేడు దివంగత సినీ నటి శ్రీదేవి 54వ జయంతి. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీకపూర్ తన తల్లిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'హ్యాపీ బర్త్ డే అమ్మా.. ఐ లవ్యూ' అని పోస్ట్ చేస్తూ.. శ్రీదేవి నటించిన చివరి సినిమా 'మామ్' లోని ఓ ఫోటో అభిమానులతో పంచుకున్నారు.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు. అలానే జాన్వీకి ధైర్యం కూడా చెబుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్ హోటల్ రూమ్ బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడి తుదిశ్వాస విడిచారు. 

శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు ఆమెతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

View post on Instagram

View post on Instagram

View post on Instagram