అక్కినేని నాగేశ్వరరావు జయంతి పురస్కరించుకొని నాగ చైతన్య కొత్త మూవీ అప్డేట్ ఇచ్చారు. చైతు తన 22వ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. 


సెప్టెంబర్ 20 లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ క్రమంలో మనవడు నాగ చైతన్య తన కొత్త మూవీపై అప్డేట్ ఇచ్చాడు. రేపటి నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు. NC 22 కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. నాగ చైతన్య యూనిఫార్మ్ లో కనిపిస్తున్నారు. అది ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన యూనిఫార్మ్ అనేది అర్థం కాలేదు. మొత్తంగా కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. 

చాలా రోజుల క్రితమే నాగ చైతన్య ఈ ప్రాజెక్ట్ గురించి మీడియాతో పంచుకున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంలో శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నారు. అలాగే ఇది బైలింగ్వెల్ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. నాగ చైతన్యతో ఆమెకిది రెండో చిత్రం. బంగార్రాజు మూవీలో నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి నటించారు. ఇక వరుస పరాజయాలతో డీలా పడ్డ కృతికి ఈ మూవీ విజయం చాలా అవసరం. 

నాగ చైతన్య సైతం థాంక్యూ మూవీతో భారీ షాక్ తిన్నాడు. చైతన్య కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా థాంక్యూ రికార్డులకు ఎక్కింది. కనీస కంటెంట్ లేకుండా తెరకెక్కిన థాంక్యూ దారుణ పరాజయం చవిచూసింది. మరి దర్శకుడు వెంకట్ ప్రభు నాగ చైతన్యకు ఈ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. మరోవైపు నాగ చైతన్య ప్రధాన పాత్రలో దూత అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.