Asianet News TeluguAsianet News Telugu

75th Indipendenceday: బోరింగ్ మొగుళ్ళు గయ్యాళి పెళ్ళాలు అంటూ... ఇండిపెండెన్స్ కి కొత్త అర్థం చెప్పిన వర్మ!

సందర్భం ఏదైనా తనదైన సెటైర్లు వేయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. ఇక దేశం మొత్తం జరుపుకునే ఇండిపెండెన్స్ డే పై వ్యంగ్యాస్త్రాలు వదలకుండా ఉంటాడా... 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఆయన వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

on 75th independence day director ram gopal varma finds new meaning of freedom
Author
First Published Aug 15, 2022, 6:44 PM IST

రామ్ గోపాల్ వర్మ ప్రతి విషయాన్ని కొత్త కోణంలో చూస్తారు. అందరిది ఒకదారైతే నా దారి సపరేట్ అంటారు. మంచైనా చెడైనా రామ్ గోపాల్ వర్మ స్పందించే తీరు ఇతరులకు భిన్నంగా ఉంటుంది. కాగా నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం కాగా,  దేశం ఘనంగా జరుపుకుంటుంది.  సోషల్ మీడియా వేదిక  శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరూ ఇండిపెండెన్స్  కి తమదైన అర్థం చెప్పారు. రామ్ గోపాల్ వర్మ దృష్టిలో మాత్రం స్వాతంత్రం అంటే అది కాదు... 

గయ్యాళి భార్యల నుండి భర్తలకు, బోరింగ్ భర్త నుండి భార్యలకు... విసిగించే పేరెంట్స్ నుండి పిల్లలు విముక్తి దొరికినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అంటూ ట్వీట్ చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ ట్వీట్ క్షణాల్లో వైరల్ కాగా... ఆయన ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో తమదైన అభిప్రాయం తెలియజేస్తున్నారు. 

ఇక తరచుగా వర్మ ట్వీట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ని ఉద్దేశిస్తూ వర్మ చేసిన కామెంట్ చాలా వివాదాస్పదమైంది. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది అయితే.. మరి పాండవులు ఎవరు? ముఖ్యంగా కౌరవులు ఎవరు? అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ నాయకులతో పాటు హిందూవాదులు వర్మపై మండిపడ్డారు. పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇక ఇటీవల వర్మ అమ్మాయి టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. ఈ మూవీ గత చిత్రాల వలె ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios