పవర్‌ స్లార్‌ పవన్ కళ్యాణ్‌, కమేడియన్‌ అలీ ఎంత మంచి ఫ్రెండ్సో అందరికి తెలిసిందే. అలీపై ఉన్న ప్రేమని పవన్‌ అనేక రూపాల్లో చాటుకుంటూ వస్తున్నారు. తన ప్రతి సినిమాలో అలీ ఉంటాడని, అది మా ఫ్రెండ్‌షిప్‌కి, ప్రేమకి నిదర్శనమని చెప్పాడు పవన్‌. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఏపీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 

ఎలక్షన్‌ టైమ్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అలీ మోసం చేశాడనే విషయాన్ని కూడా పలు సందర్భాల్లో పవన్‌ వ్యాఖ్యానించాడు. కానీ తాజాగా వీరిద్దరు కలిసి పోయారు. దీనికి వీరిద్దరు కలిసి దిగిన ఫోటోనే నిదర్శనం. అలీ బంధువుల పెళ్లి వేడుకకి పవన్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా వీరిద్దరు కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఆ వీడియోని అలీ భార్య జుబేదా సోషల్‌ మీడియాలో పోస్టర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీరి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 

అలీ.. ఈటీవీలో `అలీతో సరదాగా` షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు నటుడిగా పలు సినిమాలు చేస్తున్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ నటించిన సినిమా `వకీల్‌ సాబ్‌` విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`, క్రిష్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.