బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటేయకపోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తన సినిమాలతో దేశభక్తి చాటే అక్షయ్ ఓటు మాత్రం వేయలేకపోయారంటూ ఆయనపై విమర్శలు వినిపించాయి.

ఇప్పటికీ ఈ వివాదం ముదురుతునే ఉంది. నిజానికి ఆయన ఓటు వేయకపోవడానికి కారణం అక్షయ్ కి కెనడా దేశ పౌరసత్వం ఉండడమే.. ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించారు అక్షయ్. తనకు కెనడా పాస్ పోర్ట్ ఉన్న మాట నిజమేనని చెప్పిన ఆయన మాతృదేశమైన భారత్ అంటే ఎనలేని మక్కువ అని పేర్కొన్నారు.

కెనడా పౌరసత్వం విషయంలో  అనవసర రాద్దాంతం చేస్తున్నారని. గత ఏడేళ్లలో తాను ఎప్పుడూ కెనడా వెళ్లలేదని, ఇక్కడే ఉంటూ అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆయన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గతంలో కెనడా టొరంటోలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్.. టొరంటో తన సొంతూరు అని, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి రిటైర్ అయిన తరువాత ఇక్కడికే వచ్చి స్థిరపడతానని అన్నారు. దేశం మీద ప్రేమ ఉందంటూనే అక్షయ్ ద్వంద్వ వైఖరిని చాటుతున్నారని విమర్శలు చేస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#AkshayKumar says Toronto is his home! He will settle down there after he retire!

A post shared by Entertainment Fan Page (@facc2911) on May 3, 2019 at 2:47pm PDT