Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ఏలో ‘ఒకే ఒక జీవితం’ వసూళ్లు.. నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్న శర్వానంద్.!

టాలెంటెడ్ హీరో శర్వానంద్ (Sharwanand), అక్కినేని అమలా కలిసి నటించిన చిత్రం  ‘ఒకే ఒక జీవితం’. రీసెంట్ గా థియేటర్లలోకి రాగా.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరోవైపు యూఎస్ఏలో ఓమార్క్ కలెక్షన్లను రాబడుతోంది. 
 

Oke Oka jeevitham Movie collection in USA, Sharwanand is slowly increasing the box Office speed!
Author
First Published Sep 12, 2022, 2:51 PM IST

తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ లలో మంచి క్రేుజ్ ఉన్న హీరో శర్వానంద్. విభిన్న చిత్రాలతో శర్వా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా టైమ్ ట్రావెల్, మదర్ సెంటిమెంట్ తో ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకుంటున్నశర్వాకు ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందించింది. తొలిరోజే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఎలాంటి బజ్ క్రియేట్ చేయకుండానే చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

బాక్సాఫీస్ వద్ద కూడా ‘ఒకే ఒక జీవితం’ వసూళ్లను రాబడుతోంది. తక్కువ స్క్రీన్లలోనే విడుదలైన పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేసింది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా వసూళ్లను రాబ్టట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ చిత్రం బాగా అలరిస్తోంది. మూడు రోజుల్లో అక్కడ ఈ చిత్రం $300కే మార్క్ కలెక్షన్ ను రాబట్టి పర్లేదు అనిపిస్తోంది. ఫస్ట్ డే తక్కువ స్క్రీన్లలోనే విడులై పాజిటివ్ టాక్ రావడంతో క్రమక్రమంగా స్క్రీన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. మరెవైపు కలెక్షన్లు కూడా వస్తున్నాయి. 

ఈ చిత్రంలో తల్లికొడుకులుగా అక్కినేని అమలా, శర్వానంద్ నటించిన విషయం తెలిసిందే. టైమ్ ట్రావెల్ మరియు మదర్ సెంటిమెంట్ ను దర్శకుడు శ్రీ కార్తీక్ అద్భుతంగా చూపించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించిన చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. మూవీలో శర్వానంద్ సరసన హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) నటించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రలను పోషించారు. తెలుగు, తమిళంలో చిత్రాన్ని నిర్మించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios