అక్కినేని సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'ఓ బేబీ'. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా జూలై మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత తప్ప మరో స్పెషల్ ఎట్రాక్షన్ లేదు.

అయినప్పటికీ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్లే సినిమా బిజినెస్ కూడా జరుగుతోంది. మూడు నిర్మాణ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించాయి. ప్రొడక్షన్ కాస్త రూ.13 కోట్ల వరకు అయింది. అయితే ఆంధ్ర, నైజాం హక్కులు చేతిలో ఉండగానే ఆ పదమూడు కోట్లు రికవరీ అవ్వడం విశేషం.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.1.75 కోట్లు, కర్ణాటక హక్కులు 75 లక్షలు, నెట్ ఫ్లిక్స్ ద్వారా రూ.3 కోట్లు, శాటిలైట్ ద్వారా రూ.2 కోట్లు వచ్చాయి. అలానే హిందీ డబ్బింగ్ రైట్స్ మరో మూడు కోట్ల వరకు వచ్చాయి.

అంటే దాదాపు పదకొండు కోట్ల వరకు రికవరీ అయిపోయింది. థియేటర్ హక్కులు దగ్గరే ఉంచుకొని.. డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో వసూలు కావడం విశేషమనే చెప్పాలి. నిర్మాత సురేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో నేరుగా సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వస్తే.. ఇక లాభాల పంటే..