ఒడియాకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి సోమవారం కరోనా కారణంగా తుదిశ్వాస విడిచారు.

కరోనా మహమ్మారి చిత్ర పరిశ్రమలో విషాదాలను నింపుతోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ ఇలా పరిశ్రమ ఏదైనా, సినీ ప్రముఖులు కరోనా దెబ్బకి బలవుతున్నారు. అనేక మందిని ఇప్పటికే కరోనా తన పొట్టన పెట్టుకుంది. నిన్న ఒక్కరోజే తమిళంలో ఇద్దరు ప్రముఖులు చనిపోయారు. అటు హిందీ పరిశ్రమలోనూ మరణాలు ఆగడం లేదు. కన్నడ, మలయాళంలోనూ తరచూ సినీ వర్గాలను బలితీసుకుంటుంది. తాజాగా మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కన్నుమూశారు. 

ఒడియాకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌, నేపథ్య గాయకుడు అమరేంద్ర మహంతి సోమవారం కరోనా కారణంగా తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయన వైరస్‌ బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఆ రాష్ట్ర గవర్నర్‌ ప్రొఫేసర్‌ గణేషీ లాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌, కేంద్ర మంత్రి ప్రతాప్‌ చంద్ర షడంగి, ఓలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.