ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమా తారలు కన్ను మూస్తున్నారు. ఈక్రమంలోనే ఒరియా స్టార్ నటుడు పింటు కన్ను మూశాడు.
2022 లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మంది టాలెంటెడ్ స్టార్స్ ను కోల్పోయింది. టాలీవుడ్, కోలీవుడ్,బాలీవుడ్ నుంచి ఎందరో తారులు ఈలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈక్రమంలో 2023 లో కూడా అది కంటీన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా కళాతపస్వి విశ్వనాథ్, తారకరత్న, తమిళ స్టార్ కమెడయిన్ మయిల్ స్వామి.. ఇలా చాలా మంది తారలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈక్రమంలోనే మరో తార రాలిపోయింది.
ప్రముఖ ఒరియా నటుడు పింటు నంద అనారోగ్యంతో కన్ను మూశారు. 45 ఏళ్ళ వయస్సులో ఆయన తుదిస్వాస విడిచారు. హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పింటూ మరణించారు. చాలా కాలంగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొదట భువనేశ్వర్ లోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు పింటు. ఆరోగ్యం రాను రాను విషమిస్తుండటంతో.. ఆయన్ను ఢిల్లీకి తరలించారు. అక్కడ లివర్ ట్రాన్స ప్లాంటేషన్ చేయాలి అనుకున్నారు. కాని దాతలెవరూ దొరక్కపోవడంతో అది సాధ్యం కాలేదు.
పరిస్థితి విషమిస్తుండటంతో.. పింటు నందను ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు. కొన్ని రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో పరిస్థితి విషమించడంతో పింటు నంద కన్ను మూసినట్టు తెలుస్తోంది. లివర్ డోనర్ దొరికినా కాని.. అతని బ్లడ్ గ్రూప్ కలవకపోవడంతో.. ఆపరేషన్ సాధ్యం కాలేదు. నంద మృతితో ఒరియా సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నంద మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. ఒరియా ఫిల్మ్ ఫ్రాటెర్రిటీ కూడా దీనిపై స్పందించింది.
నంద మరణంపై ఒరియా సూపర్ స్టార్ సిద్దాంత్ మహోపాత్ర నంద స్పందించారు. ఆయన మృతిపై మీడియాతో మాట్లాడుతూ… తన మిత్రుడు నంద మృతిపై సంతాపం తెలియజేశారు. నంద తనకు చిన్న తమ్ముడిలాంటి వాడని పేర్కొన్నారు. నంద ఆకస్మిక మరణం బాధాకరమన్నారు. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న పింటు మరణం.. ఫిల్మ్ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒరియా నటులతో పాటు.. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా నటీనటులు పింటు నంద మరణంపై స్పందిస్తున్నారు.
