కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ కు సోషల్ మీడియాలో  చేధు అనుభవం కలిగింది. ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో నటి వెంటనే పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరింది. 

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు, నటీమణులకు కొన్ని సందర్భాల్లో అసభ్య ఘటనలకు గురవుతుంటారు. కొందరు వాటిని అసలు పట్టించుకోకపోయినా.. మరికొందరు హీరోయిన్లు, యాక్ట్రెస్ మాత్రం సిరీయస్ గా తీసుకుంటూ ఆ అపరిచిత వ్యక్తులకు బుద్ధి చెబుతుంటారు. అదే ఘటన తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో జరిగింది. కన్నడ నటి అయిన రమ్య ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఫొటోషూట్లు, పలు రీల్స్ , వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ పలకరిస్తుంది. ఈ క్రమంలో రమ్యకు తాజాగా సోషల్ మీడియాలో చేధు అనుభవం ఎదురైంది.

సోషల్ మీడియాలో తరుచూ ఓ వ్యక్తి తనను ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. పైగా అసభ్యకర కామెంట్స్ చేస్తూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో నటి వెంటనే పోలీసులను ఆశ్రయించి, అతడిని అరెస్ట్ చేయాలని కోరింది. ఈ మేరకు బెంగళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. రమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన ‘777’ మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని చూసిన అనంతరం రమ్య... సినిమా సూపర్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కు ప్రీతమ్ ప్రిన్స్ అనే నెటిజన్ దుర్భాషలో కామెంట్ చేశాడు.

రమ్య పలు కన్నడ చిత్రాలతో పాటు.. తెలుగు సినిమాల్లోనూ నటించింది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అభిమన్యు’ సినిమాలో హీరోయిన్ రమ్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన డబ్ చిత్రాలతోనే ఆడియెన్స్ ను అలరించింది. కొద్దికాలం తర్వాత రమ్య రాజకీయాల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రమ్య ఎంపీగానూ ఎన్నికై ప్రజా సేవా చేసింది. 2016 నుంచి ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.