అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మెగాస్టార్ ఫిల్మ్ సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన ట్రైలర్స్ తో చిత్ర యూనిట్ అంచనాల డోస్ మరింతగా పెంచేసింది. యుద్ధ సన్నివేశాల నేపథ్యంతో కట్ చేసిన బ్యాటిల్ ఫీల్డ్ ట్రైలర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. 

ఇక ఇప్పుడు సినిమాకు సంబంధించిన మొదటి వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తమన్నా తన పెర్ఫెమెన్స్ ని సాంగ్ లో ప్రదర్శించింది. నయనతార లుక్స్ మెగాస్టార్ విజువల్స్ అలాగే మరికొన్ని యాక్షన్ సీన్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ దాదాపు 270కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా అమిత్ త్రివేది సంగీతం అందించారు. మరి విడుదల తరువాత సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.