సోషల్ మీడియా వేదికగా చిరు పేరు హోరెత్తిపోయింది. అభిమానులు, చిత్ర ప్రముఖులు చిరుకు బెస్ట్ బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. అనేక జెనరేషన్స్ స్ఫూర్తిగా నిలిచే చిరు మేనియాను ఈ సందర్భంగా కొనియాడుతున్నారు.

స్టార్ ఆఫ్ స్టార్స్ మెగా స్టార్ బర్త్ నేడు. చిరంజీవి నేడు తన పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా పండగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా చిరు పేరు హోరెత్తిపోయింది. అభిమానులు, చిత్ర ప్రముఖులు చిరుకు బెస్ట్ బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. అనేక జెనరేషన్స్ స్ఫూర్తిగా నిలిచే చిరు మేనియాను ఈ సందర్భంగా కొనియాడుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టాలీవుడ్ స్టార్స్ తమదైన శైలిలో చిరంజీవికి బర్త్ డే విషెష్ తెలియజేశారు. పవన్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి బర్త్ డే విషెష్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరుకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు. ఆయన తనకే కాకుండా ఎందరికో మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయుడు అంటూ కొనియాడారు. 

Scroll to load tweet…


యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిరుకు మధ్య ప్రత్యేక అనుబంధం కలదు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఆయన భవిష్యత్ బాగుండాలని కోరుకున్నారు. 

Scroll to load tweet…

భోళా శంకర్ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మహేష్... గౌరవంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేసిన మహేష్, దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకరకు బెస్ట్ విషెష్ తెలియజేశారు.

Scroll to load tweet…

ఒకరోజు ముందే ప్రత్యేక వీడియో ద్వారా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రభాస్. ఆయన సోషల్ మీడియా వేదికగా మెగా మెగా మెగా స్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మాతో పాటు రాబోయే భవిష్యత్ తరాలకు మీరు స్ఫూర్తిగా నిలిచారు.. ఐ లవ్ యు సర్ అంటూ, ప్రభాస్ అభిమానం చాటుకున్నారు. 


ఆచార్య మూవీతో తండ్రి చిరుతో కలిసి పూర్తి స్థాయి మల్టీ స్టారర్ చేస్తున్న చరణ్, ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. అప్పా అని పిలుచుకునే ఆయనతో నాకు ఎన్నో మరపురాని అనుభూతులు. నా ఆచార్యకు బెస్ట్ బర్త్ డే విషెస్ అంటూ... చరణ్ ట్వీట్ చేశారు. అలాగే ఆచార్య సెట్స్ నుండి కొన్ని అద్భుత విజువల్స్ తో కూడిన వీడియో విడుదల చేశారు. 

Scroll to load tweet…


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ త్రో బ్యాక్ పిక్ పంచుకోవడంతో పాటు మామ చిరుకు బర్త్ డే విషెష్ తెలియజేశారు. టీనేజ్ లో ఉన్న బన్నీ, చిరు పక్కనే వినయంగా కూర్చున్న సదరు ఫోటో ఆసక్తి రేపుతోంది. 

Scroll to load tweet…