ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్30 మూవీనుంచి సాలిడ్ అప్ డేట్ రాబోతోంది. తారక్ బర్త్ డు సందర్భంగా ఫస్ట్ లుక్ సందడి చేయబోతోంది. 

గెట్ రెడీ తారక్ ఫ్యాన్స్... మీ కోసం ఎన్టీఆర్ 30 టీమ్ అద్భుతమైన అప్ డేట్ ను రెడీ చేసింది. ఎంతో కాలంగా ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న ఎన్టీఆర్30 నుంచి.. అప్ డేట్ ను అందించబోతున్నారు మూవీ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో .. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనౌన్స్ చేసిన రెండేళ్లకకు షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈసినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాు ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఆశలకు తగ్గట్టుగానే ముందుగానే అంతా రెడీ చేసుకున్న కొరటాల శివ.. షూటింగ్ విషయంలో స్పీడ్ చూపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్... తరువాత చేస్తున్న సినిమా కావడంతో.. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇక తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సాలిడ్ అప్ డేట్ కు రెడీ అయ్యారు మూవీ టీమ్. మే 20న తారక్ బర్త్ డే కావడంతో.. ఒక రోజు ముందు... అంటే 19న ఎన్టీఆర్ 30 నుంచి పవర్ ఫుల్ ఫ్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ పోస్టర్ తో టైటిల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు సబంధించిన అనౌన్స్ మెంట్ ను కూడా ఓ పోస్టర్ తో రిలీజ్ చేశారు టీమ్. సముద్రం ఒడ్డున వరుసగా కత్తులు గుచ్చుకుని ఉన్నపోస్టర్ తో పాటు.. సముద్రం అంతా ఆయన రక్తం నిండి ఉంది అన్న కొటేషన్ తో పోస్టర్ ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేశారు మూవీ టీమ్. ఎప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఆరోజు పండగ చేసుకోబోతున్నారు. 

ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ తో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని..కొరటాల శివ సాలిడ్ కథను తయారు చేసుకున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈసినిమా కోసం పనిచేస్తున్నారు. మూడో షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీసెట్ మధ్య..ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా... తారక్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్ లో ఆయన పాల్గొన్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమూవీని యువసుధ ఆర్ట్స్ తో కలుపుకుని... ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.