#NTR30: డిజాస్టర్ సినిమాని గుర్తు చేస్తున్న షూట్ ప్లాన్,కంగారులో ఫ్యాన్స్
‘ఎన్టీఆర్-కొరటాల2’గా ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పుడే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఈ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ క్రేజీ కాంబోపై పడింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటిశ్వరులు పోగ్రాంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆయన కొరటాల శివ డైరక్షన్ లో #NTR30 ప్రాజెక్టుకు సిద్దపడుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ కాంబో పై అంచనాలు పెరిగిపోయాయి. 'ఆచార్య' సినిమా పనులు పూర్తి చేసిన కొరటాల.. ఎన్టీఆర్ కథపై పూర్తిగా కూర్చుంటున్నారట. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తైందని సమాచారం. అయితే ఈ సినిమా కు వేసిన షెడ్యూల్ ఇప్పుడు అభిమానులని కంగారు పెడుతోంది.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సంభందించిన రెండు షెడ్యూల్స్ ని ఈజిప్టులో ప్లాన్ చేసారు. అక్కడే దాదాపు నలభై శాతం సినిమా జరుగుతుందిట. ఇది విన్న అభిమానులకు గుండెల్లో రాయిపడుతోంది. గతంలో ఎన్టీఆర్ ..ఈజిప్టులో చేసిన శక్తి సినిమా డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా ఈజిప్ట్ లో తీసిన సీన్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అది గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలెట్టేసారు ఫ్యాన్స్, యాంటి ఫ్యాన్స్. అయితే ప్రతీసారీ అలా ఎందుకు జరుగుతుంది. మంచి కథ ఉన్నప్పుడు లొకేషన్స్ ఖచ్చితంగా ప్లస్ అవుతాయి. అందులోనూ కొరటాల శివ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తూంటారు. అందుకే ఆయనకు సక్సెస్ రేటు బాగా ఎక్కువ.
స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఈ చిత్రంలోని నటీనటులు, టెక్నీషియన్లు ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్ పని చేయబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలుని ఫైనల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ వివరాలు కూడా ఇంకా ప్రకటించలేదు. కానీ అలియా భట్, లేదా కియారా అద్వానీలలో ఎవరో ఒకరిని తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రష్మిక పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న RRR సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటన ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ పూర్తవ్వగానే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో #NTR30 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఆచార్య కన్నా ముందే ఈ సినిమా షూట్ స్టార్ట్ అవుతుంది.