యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తీసుకున్న ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.సినిమాలతో బిజీగా గడుపుతోన్న ఎన్టీఆర్ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నాడు.

ఇటీవల జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎలెక్షన్స్ లో తన సోదరి సుహాసిని పోటీ చేసినా.. ఎన్టీఆర్ మాత్రం ఆమె తరఫున ప్రచారం చేయలేదు. మొక్కుబడిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఊరుకున్నాడు.

ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడానికి కారణం ఇదేనంటూ చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదైతేనేం తారక్ మాత్రం ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవ్వాలేదు. కానీ తాజాగా ఆయన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది.

ఓ ప్రైవేట్ పార్టీలో ఎన్టీఆర్, కేటీఆర్ లు కలిసి ఫోటో దిగినట్లు సమాచారం. అయితే ఆ పార్టీ ఎవరు హోస్ట్ చేశారు..? ఎక్కడ జరిగింది..? అనే విషయాల్లో మాత్రం స్పష్టత లేదు.