యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా బ్రదర్ అంటూ... ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వేగంగా వెళుతున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పడంతో సాయి ధరమ్ తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన అనంతరం సాయి ధరమ్ స్పృహ కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దగ్గర్లోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండీషన్ పై నేడు ఉదయం అపోలో వైద్యులు లేటెస్ట్ బులెటిన్ విడుదల చేశారు. సాయి ధరమ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అన్ని ప్రధాన అవయవాలు సాధారణంగా పని చేస్తున్నాయి. ఐసీయూ విభాగంలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాము. డాక్టర్స్ పర్యవేక్షణ కొనసాగుతుండగా, నేడు మరి కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం... అని తెలుపుతూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

యువ హీరో త్వరగా కోలుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలియజేస్తున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా బ్రదర్ అంటూ... ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సైతం వీడియో సందేశం ద్వారా ధరమ్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్నారు. 

Scroll to load tweet…


వైఎస్ఆర్ సీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ''ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్ పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి...'' అంటూ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…