Asianet News TeluguAsianet News Telugu

RRR Mumbai Event: ముంబయి వేదికగా అభిమానులకు ఎన్టీఆర్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌.. కారణమిదే?

`ఆర్‌ఆర్‌ఆర్‌` ముంబాయి ఈవెంట్‌లో తన అభిమానులకు ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మామూలుగా కాదు, స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.

ntr warning to his fans in mumbai rrr pre release event
Author
Hyderabad, First Published Dec 19, 2021, 10:57 PM IST

యంగ్‌టైగర్‌, మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌.. ముంబయిలో జరిగిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొన్నారు. వీరితోపాటు హిందీ వర్షెన్‌ ప్రజెంటర్‌ కరణ్‌ జోహార్‌, ఈవెంట్‌ గెస్ట్ సల్మాన్‌ ఖాన్‌, హీరోయిన్లు అలియా భట్‌, శ్రియా పాల్గొన్నారు. సందడి చేశారు. ఇక ఈవెంట్‌కి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఎంట్రీ అదిరిపోయింది. పై నుంచి సింహాసనం పై నుంచి దిగుదుతూ అభిమానులకు పూనకాలు తెప్పించారు. రాజమౌళికి సైతం గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికారు. మరోవైపు ఆ ఈవెంట్‌ సమీపంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ భారీ కటౌట్లు వెలియడం విశేషం. 

ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌లో తన అభిమానులకు ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మామూలుగా కాదు, స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. స్టేజ్‌పై నుంచే ఆయన వార్నింగ్‌ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ముంబయి ఆడియెన్స్  మనసులను గెలుసుకున్నారు. ఎన్టీఆర్‌ చెప్పిన విధానానికి అంతా ఫిదా అవ్వడం విశేషం. మరి ఎందుకు ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇవ్వాల్సి వచ్చిందంటే. 

ముంబయి ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈవెంట్‌ ప్రారంభం నుంచి హంగామా చేశారు. గట్టిగా అరుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈవెంట్‌కి ఊపుని, ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అభిమానం ఎక్కువైంది. అక్కడ ఉన్న భారీకేడ్లు, ఇతర నిర్మాణాలపైకి ఎక్కి గోల చేశారు. బాగా అరుస్తూ ఈవెంట్‌కి అడ్డంకిగా మారారు. దీంతో కరణ్‌ జోహార్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ అన్న మీ అభిమానులను ఎవరూ ఆపలేరు. తారక్‌ అభిమానులను ఈ తరహాలో నేనెప్పుడూ చూడలేదు` అని పేర్కొన్నారు. 

దీంతో ఇది గమనించిన ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. తన అభిమానులను హెచ్చరించారు. పైకి ఎక్కడాన్ని తప్పు పట్టారు. `పద్ధతిగా లేదు.. కిందకి దిగండి. కిందకి దిగుతారా దిగరా. కిందకి దిగండి.  కిందికి దిగి ఎంజాయ్ చేయండి. మన గురించి అందరు బాగా మాట్లాడుకోవాలి. కిందకి దిగండి` పదే పదే తనదైన స్టయిల్‌లో గాంభీర్య స్వరంతో హెచ్చరించడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే గెస్ట్ గా వచ్చిన బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌.. ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్‌ యాక్టింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాదు.. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విడుదలైన నాలుగు నెలల వరకు మరో సినిమా విడుదల చేసే ధైర్యం ఎవరూ చేయలేరని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios