Asianet News TeluguAsianet News Telugu

సర్ ప్రైజ్..అల్లు అర్జున్ పుష్ప2 సెట్ లో జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకు వచ్చారంటే..?

అల్లు అర్జున్ పుష్ప 2 సెట్స్ లోకి ఎన్టీఆర్  సందడి చేశారు. తారక్ బన్నీతో సినిమా సెట్ లో సందడి చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. పుష్ప2 సెట్స్ కు తారక్ ఎందుకు వెళాడు..? కారణం ఏంటి..?
 

NTR Visits Allu Arjun pushpa2 sets in Ramoji film city JMS
Author
First Published Apr 27, 2023, 12:06 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. పుష్పతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కాంబో.. అంతకు మించి అన్నట్టుగా పుష్ప 2 ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి.  సెకండ్ పార్ట్ పై ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల మూవీ నుంచి  అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ కూడా ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. తాజాగా  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. మూవీ కోసం వేసిన ప్రత్యేక సెట్ లో ఇంపార్టెంట్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలో ఈ మూవీ సెట్ లో నిన్న (ఏప్రిల్ 26) సర్ ప్రైజింగ్ గా ఎన్టీఆర్ ప్రత్యక్ష్యం అయ్యారు. బుధవారం  జూనియర్ ఎన్టీఆర్ సెట్ లోక గ్రాండ్  ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ ప్రైజ్ చేశాడు. . అందుకు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పిక్ లో ఎన్టీఆర్ ఫార్మల్ లుక్ లో క్యాజ్యువల్ గా  కనిపిస్తున్నాడు. NTR30 షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ పుష్ప 2 సెట్ లోకి ఎందుకు వచ్చాడు అనేది  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

 

 

ఇక రీసెంట్ గా  అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా.. బావా హ్యాపీ బర్త్ డే అటూ..  ఎన్టీఆర్ చేసిన ట్వీట్.. దానికి బన్నీ బావా హగ్ అంటూ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పార్టీ లేదా పుష్ప అంటూ.. తారక్ చేసిన రీ ట్వీట్ కూడా హాట్ టాపిక్ అయ్యింది.  ఇక ఇప్పుడు బన్నీ సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగు పెట్టడంతో ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ అభిమానులు ఆ ఫోటోను సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కు పార్టీ ఇవ్వడానికి పుష్పరాజ్ ఏర్పాట్లు చేశాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

అటు ఎన్టీఆర్30 షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ లోకి బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కూడా ఎంటర్ అయ్యారు. తారక్ కు విలన్ గా నటిస్తున్నాడు సైఫ్ . బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈసినిమా ద్వారా సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్ గా ఆమె షూటింగ్ లో కూడా పాల్గోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ డైరెక్షన్ లో వీరిద్దరి పై భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios