కరోనా లాక్ డౌన్ అందరినీ ఇంటికే పరిమితం చేసిన సంగతి తెలిసిందే.  బోరుకొట్టినా బాధనిపించినా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్దితి. లేకపోతే కరోనాకి బలికాక తప్పదని అర్దమై దాదాపు అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు . అలాగే సెలబ్రెటీలు, సినీ  ప్రముఖులు సైతం లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ సామాన్యులలో అవగాహన కల్పిస్తున్నారు. మరోప్రక్కన రియల్ మ్యాన్ ఛాలెంజ్ లు వంటివి ఏక్సెప్టు చేసి వీడియోలు వదులుతున్నారు. తమ అభిమాన హీరోలను ఏదో విధంగా చూడటంతో ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఏం చేస్తున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో ఆయన ప్లాన్ ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఆయన మాస్టర్ ప్లాన్ వేసారని తెలుస్తోంది. 
 
అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ ఈ సమయంలో తన డబ్బింగ్ స్కీల్స్ కు పదను పెడుతున్నారట. ఈ మేరకు ఆన్ లైన్ ఫాఠాలు సైతం తీసుకుంటున్నారట. స్కైప్ లో కొందరి టీచర్స్ ద్వారా మళయాళం పై దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే హిందీ, తమిళ,కన్నడ భాషల్లో కూడా తనే స్వయంగా ఆర్ ఆర్ ఆర్ కు డబ్బింగ్ చెప్పాలని రాత్రింబవళ్లూ కష్టపడుతున్నట్లు చెప్తున్నారు. 

రీసెంట్ గా విడుదలైన ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ లుక్ వీడియోకు కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కి  విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అందులో రామ్ చరణ్ లుక్ ని ఇష్టపడిన వారెంత మంది ఉన్నారో ఎన్టీఆర్ గొంతుకి ఫిదా అయిన వారు కూడా అంతే మంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజుని ఎన్టీఆర్ గొంతుతో పరిచయం చేయడం ప్రేక్షకులకి బాగా నచ్చింది. 

కేవలం ఒక నిమిషంన్నర వీడియోతోనే రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడంటే అది ఎన్టీఆర్ వాయిస్ లోని గొప్పదనమే అని అంతా మెచ్చుకుంటున్నారు. మాతృభాష కాని మిగతా  మూడు  భాషల్లో వాయిస్ ఓవర్ వినిపించిన ఎన్టీఆర్.. ప్రతీ భాషలోనూ పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాడు. హిందీ, తమిళ, కన్నడ..ఇలా ఏ భాషలో చెప్పినా అది తన సొంత భాషే అన్నంత సహజంగా చెప్పాడు.