అభయ్ పెద్దవాడైపోయాడు: ఎన్టీఆర్

ntr tweet on abhayram
Highlights

ఎన్టీఆర్ ఈరోజు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు

ఎన్టీఆర్ ఈరోజు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ కు విషెస్ చెబుతున్నారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమైన ఫస్ట్ విష్ గురించి అభిమానులతో పంచుకున్నాడు. అభిమానులు చూపించే ప్రేమ ఒక ఎత్తయితే తన కొడుకు అభయ్ రామ్ చేసే ఫస్ట్ విష్ మరో ఎత్తని అంటున్నాడు ఎన్టీఆర్. తన కొడుకుని భుజాల మీద ఎక్కించుకొని తీసుకున్న ఫోటోను తారక్ అభిమానులతో పంచుకున్నాడు.

''ఇప్పుడు అభయ్ నా కళ్లు మూయడం మానేశాడు. పెద్దవాడైపోతున్నాడు.. తను చేసే మొదటి బర్త్ డే విష్ నాకెంతో స్పెషల్'' అంటూ ట్వీట్ చేశారు.  

 

loader