ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమా క్యాన్సిల్‌ కాలేదా.. ఎప్పుడో తెలుసా?

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మధ్య మనస్పర్థాలు వచ్చాయంటూ వార్తలు ఊపందుకున్నాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. క్రియేటివ్‌ డిఫరెన్స్ అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం మేరకు వీరి కాంబినేషన్‌లో సినిమా క్యాన్సిల్‌ కాలేదని తెలుస్తుంది.

ntr trivikram movie cancel actual truth this  arj

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ అది ఇటీవల క్యాన్సిల్‌ అయిన విషయం తెలిసిందే. `ఎన్టీఆర్‌30`ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఉన్నట్టుండి ఆ స్థానంలోకి కొరటాల శివ వచ్చాడు. దీంతో త్రివిక్రమ్‌తో సినిమా లేదంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మధ్య మనస్పర్థాలు వచ్చాయంటూ వార్తలు ఊపందుకున్నాయి. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. క్రియేటివ్‌ డిఫరెన్స్ అంటూ ప్రచారం జరిగింది. 

కానీ తాజా సమాచారం మేరకు వీరి కాంబినేషన్‌లో సినిమా క్యాన్సిల్‌ కాలేదని తెలుస్తుంది. త్వరలోనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్‌.. కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాల అనౌన్స్ మెంట్‌ జరిగింది. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. ఇంకా రెండు సినిమాల తర్వాత అంటే అప్పటికి చాలా లెక్కలు మారిపోతుంటాయి. అప్పటికైనా ఉంటుందా? లేదో చెప్పడం కష్టమే. 

ఎన్టీఆర్‌తో సినిమాకి గ్యాప్‌ రావడంతో త్రివిక్రమ్‌.. మహేష్‌తో సినిమాకి కమిట్‌ అయ్యారు. వీరి `అతడు`, `ఖలేజా`ల తర్వాత వీరి కాంబినేషన్‌లో మూడోసారి ఈ సినిమా రాబోతుంది. త్వరలోనే దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఎన్టీఆర్‌ ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌`లో బిజీగా ఉన్నారు. కరోనాతో ఆగిపోయిన షూటింగ్‌ తిరిగి ప్రారంభం కాబోతుంది. దీనికి రాజమౌళి దర్శకుడనే విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ మరో హీరో. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios