మధురమైన గాత్రంతో కోట్టాది మందిని మంత్రముగ్ధులను చేసిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్తను సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికన లతాజీ  మృతి పట్ల వారి సంతాపం వ్యక్తం చేశారు. 

సంగీత ప్రియులకు నేడు చీకటి రోజు. లతా మంగేష్కర్ మరణం భారీ కుదుపు. తరాలుగా నిరంతరం వీనుల విందైన పాటలు అందించిన స్వర శిఖరం నేలకొరిగిన దుర్దినం. లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఆమె అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో. ప్రయాణాల్లో, పనుల్లో ప్రతి ఒక్కరి ఫేవరేట్ గా ఉన్న లతాజీ సాంగ్స్ ఉన్నాయి. ఒక గాయనిగా ఆమె లిఖించిన చరిత్ర తిరుగులేనిది. 20 బాషల్లో, దాదాపు 25 వేల పాటలను పాడిన లతా మంగేష్కర్ కోట్లాది మంది అభిమానులను తన సొంత చేసుకుంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్... భాషాబేధం లేకుండా వేల కొలది పాటలు పలు చిత్ర పరిశ్రమలకు పాడారు. కెరీర్ లో లతా మంగేష్కర్ పాడినన్ని పాటలు మరో సింగర్ పాడలేదు. ఇది ప్రపంచ రికార్డు కూడాను. ఐదారు తరాల బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు లతా మంగేష్కర్ పాడారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

లతాజీ మరణవార్త తెలిసిన చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లతాజీ మరణం పట్ల పెద్ద ఎత్తున నివాళ్లులు అర్పిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాటలను, ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిది అంటూ ఆవేదన చెందుతున్నారు.

ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahaman) లతాజీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘సింగర్ లతా మంగేష్కర్ కు నా ప్రేమ, గౌరవం ఎల్లప్పుడూ ఉంటాయి’అంటూ రోస్ ఫ్లవర్ తో సంతాపం వ్యక్తం చేశారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు ‘అనిల్ కపూర్’(Anil Kapoor) కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘లతాజీ మరణం హృదయ విదారకమైన ఘటన. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. లతాజీ ఎప్పుడు మా హృదయాల్లోనే ఉంటారు. అంత గొప్ప గాయని జ్ణాపకాలను మా నుంచి ఎవరూ వేరు చేయలేరు. ఆమె సంగీతంతో మన జీవితాలను ఎంతో ప్రభావితం చేసింది. ఇక ఆమె స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.’ అంటూ భావోద్వేగభరింగా పోస్ట్ చేశారు అనిల్ కపూర్. అలాగే సోనూసూద్ కూడా తన కండోలెన్స్ తెలిపారు. ‘ఆమె ఎప్పటికీ జీవించే ఉంటుంది’ అంటూ లతాజీ నవ్వుతూ ఉన్న ఫొటోను పోస్ట్ చేసి నివాళి అర్పించాడు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

టాలీవుడ్ నుంచి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), విక్టరీ వెంకటేశ్ ( Venkatesh), మంచు లక్ష్మీ ( Manchu Laxmi) సోషల్ మీడియా వేదికన లతాజీకి సంతాపం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న సాన్నిహిత్యాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఎన్టీఆర్ స్పందిస్తూ ‘లతాజీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా ఆమె మరణం దేశానికి తీరని నష్టం. మెలోడీ రాణి మన హృదయాలలో, మనస్సులలో ఎప్పుడూ ఉంటుంది. ఒక తరం సింగర్స్ ను ఆమె జీవితం స్ఫూర్తిదాయకం.’ అంటూ పేర్కొన్నాడు. విక్టరీ వెంకటేష్ స్పందిస్తూ.. ‘గానకోకిల లతా మంగేష్కర్ చనిపోయారనే గుండెపగిలే వార్త తెలిసింది. ఎందరికో లతాగారు స్ఫూర్తి. ఆవిడలేని లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది’ అంటూ వెంకటేశ్ ట్వీట్ చేశారు. మరోవైపు మంచు లక్ష్మి కూడా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. ‘అద్భుతమైన స్వరంతో స్ఫూర్తిదాయకమైన జీవితం కలిగిన వ్యక్తి ఇక మన మధ్య లేరు. ఈ వార్త వినడానికే ఎంతో బాధాకరంగా ఉంది. ఆమె బంగారు గాత్రం రాబోయే తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. లతాజీ ఆత్మకు శాంతి చేకూరాలి’. అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. 

Scroll to load tweet…