Asianet News TeluguAsianet News Telugu

తలవంచి నా మన్నింపుని కోరుతున్నా.. అభిమానులకు ఎన్టీఆర్‌ క్షమాపణలు..

`బ్రహ్మాస్త్ర` ఈవెంట్‌కి ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. చాలా ఆలస్యంగా ప్రారంభమైన ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. 

ntr says sorry to fans and media regards brahmastra pre release event cancel
Author
First Published Sep 2, 2022, 10:44 PM IST

ఎన్టీఆర్‌(NTR) తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. `బ్రహ్మాస్త్ర` (Brahmastra) ఈవెంట్‌ చివరి నిమిషంలో క్యాన్సిల్‌ అయిన నేపథ్యంలో క్యాన్సిల్ కి గల కారణాలు తెలియజేస్తూ సారీ చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో `బ్రహ్మాస్త్ర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని భావించగా, చివరి నిమిషంలో పోలీసులు ఈ ఈవెంట్‌కి అనుమతివ్వలేదు. దీంతో అప్పటికప్పుడు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్‌లో ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. చాలా ఆలస్యంగా ప్రారంభమైన ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. 

`ముందుగా నేను నా అభిమానులకు క్షమాపణలు తెలియజేయాలి. ఎంతో ఆర్భాటంగా `బ్రహ్మాస్త్ర` ఈవెంట్‌ని చేయాలనుకున్నారు. కానీ వినాయక చవితి ఉండటం వల్ల పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఎక్కువగా ఇవ్వలేమని, ఈవెంట్‌ని కంట్రోల్‌ చేయడం కష్టమనే ఉద్దేశంతో పోలీసులు పర్మిషన్‌ ఇవ్వలేదు. వాళ్లు ఉండేది, చేసేది మన భద్రత కోసం కాబట్టి వాళ్లు చెప్పే మాట వినడం ఈ దేశ పౌరుడిగా మన ధర్మం. అందుకు మేం కూడా వాళ్లకి సహకరించి ఈ రోజు ఇలా ఏర్పాటు చేయించాం` అని తెలిపారు ఎన్టీఆర్‌. 

ఆయన ఇంకా చెబుతూ, ఈ ఈవెంట్‌ కి వచ్చిన, వద్దామనుకున్న అభిమానులకు అందరికి తలవంచి నా మన్నింపుని కోరుకుంటున్నా. ఈవెంట్‌కి రాకపోయినా మీరు మంచి సినిమాని ఆశీర్వదిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మీడియాకి కూడా క్షమాపణలు తెలియజేశారు తారక్‌.  రణ్‌ బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటించిన `బ్రహ్మాస్త్ర`లో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9న ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios