ప్రస్తుతం  దర్శకుడు రాజమౌళి... 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ కోసం పని చేస్తున్నాడు, ఈ టీజర్ ఎన్.టి.ఆర్ చేసిన భీమ్ పాత్రను రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో పరిచయం చేస్తుంది. టీజర్ రఫ్ కట్ పూర్తయింది. బాక్ గ్రౌండ్ స్కోర్‌ను ఇంకా పెండింగ్ ఉంది. ఈ టీజర్ అక్టోబర్ 22 న వస్తుంది.  ఈ మేరకు 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ మూడు రోజుల షూట్ షెడ్యూల్ గత వారం పూర్తి చేసుకుంది. త్వరలోనే టీమ్ మళ్లీ షూట్ చేయటానికి సన్నాహాలు చేసుకుంటోంది.  అయితే భారీ వర్షాలతో ఈ వారం తర్వాత మొదలుపెట్టాలని భావించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను కూడా వాయిదా వేయాలని రాజమౌళి అండ్ టీం భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. 
 
ఇక మంగళవారం కురిసిన కుండబోత వర్షం ధాటికి హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో వరద నీరు  చేరుకోవడంతో నగరవాసులు పలు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం ఎఫెక్ట్ తో చాలా  సినిమా షూటింగ్స్ తాత్కాలికంగా  నిలిచిపోయాయి. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు వెలువడిన తర్వాత టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా తమ సినిమా షూటింగ్స్ మొదలుపెట్టిన  విషయం తెలిసిందే.

అయితే ఇలా హఠాత్తుగా భారీగా వర్షం పడటంతో షూటింగ్స్ కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రవితేజ, నాని, అఖిల్ అక్కినేని, నాగ చైతన్య, సుశాంత్, ఇతర హీరోల సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వర్షంతో హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నిర్మాణ సంస్థలు షూటింగ్స్ కు తాత్కాలికంగా బ్రేక్ వేశాయి.