వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న మల్టీస్టారర్ ఫిల్మ్  ఆర్ఆర్ఆర్ (RRR) కోసం ఆడియెన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ రిలీజ్ డే సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కటౌట్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

దర్శకధీరుడు జక్కన్న, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ఆడియెన్స్ లో ఓరకమైన జోష్ ఉంటుంది. జక్కన్న నిర్మించే ఏ సినిమా అయినా ప్రారంభం నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఇక ఇద్దరు బడా హీరోలతో మల్టీస్టారర్ సినిమా అంటే అటు ఆడియెన్స్.. ఇటు ఫ్యాన్స్ లో నెలకొనే సందడి పండగ వాతావరణాన్ని సూచిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరు ఉద్యమ వీరుల జీవిత చర్రితలను ఫిక్షన్ రూపంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ టాక్ తో హైరెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. 

మరోవైపు జక్కన్న పక్కా ప్లాన్ వేసుకొని పకడ్బందీగా ప్రమోషన్స్ చేయడం సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈచిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ లో సినిమాపై ఓ రేంజ్ ఒపీనియన్ ను క్రియేట్ చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా తరుచూ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేళలకు మార్చి 25న రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను కూడా జోరుగా నిర్వహించడంతో.. ఇటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా రీలీజ్ డే సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతున్నారు. వారి హీరోపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకు అటు కోదాడ, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వంటి ప్రధాన ఏరియాల్లో అభిమానులు థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. 

Scroll to load tweet…

ఆర్ఆర్ఆర్ గ్రాండ్ రిలీజ్ కోసం థియేటర్ల వద్ద రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు భారీ కటౌట్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, కోదాడలోలో థియేటర్లను అభిమానులు ముస్తాబు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అల్టూరి సీతారామ రాజులో ఉన్న రామ్ చరణ్, కొమరం భీం వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ భారీ కటౌట్లు థియేటర్ పరిసర ప్రాంతాల్లో ‘ఆర్ఆర్ఆర్’ పండగ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. మరోవైపు ట్విట్టర్లలోనూ ఆర్ఆర్ఆర్ కు వెల్ కమ్ చెబుతూ ఫ్యాన్స్ పేపర్ ఆర్ట్స్, టీ కప్స్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖచిత్రాలను వేస్తూ డైహార్డ్ ఫ్యాన్స్ అనిపించుకుంటున్నారు. 

Scroll to load tweet…

మరోవైపు, తమ అభిమాన హీరోల సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ సభ్యులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తా చర్యలు తీసుకుంటున్నారు. ఆడియెన్స్ పండగ వాతావరణంలో సినిమాను ఎంజాయ్ చేసేలా తగిన ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కావడంతో ట్విట్టర్ మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టాకే నడుస్తోంది. ఫ్యాన్స్ ఎవరెవరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారా తెలుపుతున్నారు.