Asianet News TeluguAsianet News Telugu

కొమరం భీమ్ లుక్ కోసం 18నెలల కఠిన కసరత్తులు చేశా!

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన తరువాత మొదటిసారి ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడ్డారో వివరించారు. 

ntr opens up how he was trained for rrr komaram bheem role ksr
Author
Hyderabad, First Published May 12, 2021, 3:37 PM IST

దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న చిత్రాలలో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం భాషాబేధం లేకుండా, అన్ని పరిశ్రమలకు చెందిన ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి అడుగడుగునా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే అనుకున్న సమయం కంటే ఏడాదికి పైగా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకోగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. 


కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన తరువాత మొదటిసారి ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడ్డారో వివరించారు. దాదాపు 18నెలలు భీమ్ లుక్ కోసం ఎన్టీఆర్ కఠిన కసరత్తులు చేశారట. ఆర్ ఆర్ ఆర్ కి ముందు ఎన్టీఆర్ 71 కేజీల బరువు ఉండగా, కొమరం భీమ్ పాత్ర కోసం 9కేజీల మజిల్ బాడీ పెంచాల్సి వచ్చిందట. దాని కోసం చాలా కష్టపడినట్లు ఎన్టీఆర్ తెలియజేశారు. 


అలాగే కొరటాల మూవీ గురించి కూడా ఎన్టీఆర్ కొన్ని విశేషాలు పంచుకున్నారు. కొరటాల శివతో చేస్తున్న మూవీ సైతం పాన్ ఇండియా మూవీగా పలు బాషలలో విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ చెప్పడం విశేషం. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ హోమ్ క్వారంటైన్ లో ఉంటూ కోవిడ్ కి చికిత్స తీసుకుంటున్నారు. ఈనెల 10న ఎన్టీఆర్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios