ఎన్టీఆర్‌.. ఇప్పటికే ఓ బాలీవుడ్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. `వార్‌ 2`తో మెరవబోతున్నారు. ఈనేపథ్యంలో మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరో బాలీవుడ్‌ సినిమా చేయబోతున్నారట తారక్‌.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. తన మార్కెట్‌ని విస్తరించుకునేందుకు పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో వెళ్తున్నారు. ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఇప్పటికే ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యారు. గ్లోబల్‌ వైడ్‌గా పేరు తెచ్చుకున్నారు. కొమురం భీమ్‌ పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించి మెప్పించారు. గ్లోబల్‌ ఆడియెన్స్ నుంచి ప్రశంసలందుకున్నారు. ప్రశంసలు వేరు, మార్కెట్‌ వేరు. ఇప్పుడు మార్కెట్‌ని టార్గెట్‌ చేశాడు. 

ఎన్టీఆర్‌ నార్త్ లో తనకంటూ మార్కెట్‌ని విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన బాలీవుడ్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందే `వార్‌ 2` చిత్రంలో ప్రధాన పాత్రలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేయబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ తాజాగా మరో బాలీవుడ్‌ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. `వార్‌ 2` కంటే ముందే ఆయన బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మరో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాలో తారక్‌ కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అది ఎవరో కాదు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం సల్మాన్‌ `టైగర్‌ 3` చిత్రంలో నటిస్తున్నారు.మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ లో తారక్‌ కనిపిస్తారట. ఓ కీలకమైన పాత్రలో గెస్ట్ రోల్‌లో తారక్‌ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో షారూఖ్‌ ఖాన్‌ కూడా గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. ఆయనతోపాటు ఎన్టీఆర్‌ని కూడా తీసుకోవాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన తారక్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఆయనకూడా పాజిటివ్‌గానే ఉన్నారని, తారక్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమని అంటున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే `టైగర్‌3` బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ కాబోతుందని చెప్పొచ్చు. 

మరోవైపు ఎన్టీఆర్‌.. మరో పాన్‌ ఇండియా మూవీ `సలార్‌`లోనూ కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. కీలకమైన ఎపిసోడ్‌లో తారక్ ఎంట్రీ ఉంటుందన్నారు. అటు `కేజీఎఫ్‌` ఫేమ్‌ యష్‌ కూడా కనిపిస్తారట. దీంతో `సలార్‌`పై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో నెక్ట్స్ ఎన్టీఆర్‌ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తారక్‌ `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు.