ఈవెంట్‌లో రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు చరణ్ సైతం రాజమౌళి, ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ లాంటి బ్రదర్ దొరకడం తమ అదృష్టమన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తనకు `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాతో మంచి బ్రదర్ దొరికాడని, అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాడు చరణ్. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రమోషన్‌లో భాగంగా సోమవారం సాయంత్రం చెన్నైలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.ఇందులో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌లో రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు చరణ్ సైతం రాజమౌళి, ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ లాంటి బ్రదర్ దొరకడం తమ అదృష్టమన్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాతో తారక్‌తో బ్రదర్‌వుడ్‌ని చాలా ఇష్టపడ్డానని తెలిపారు. ఆ స్నేహం మరింత బలపడిందని పేర్కొన్నారు. `నేను చనిపోయేంత వరకు ఆ సోదరభావం నా మనసులో పెట్టుకుంటా` అని తెలిపారు. తారక్ రియల్ లైజ్‌లో చైల్డ్ లాంటి మనస్తత్వం అని, సింహాం లాంటి పర్సనాలిటీ అని తెలిపారు. ఆయనతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తారక్ లాంటి బ్రదర్‌నిచ్చినందుకు దేవుడుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అని, అయితే ఎన్టీఆర్‌కి మాత్రం తాను థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టుకోలేనని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు రాజమౌళి గురించి చెబుతూ, నా గురువు అనాలా? హెడ్ మాస్టర్ అనాలా? గైడ్ అనాలా? నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా? మా రాజమౌళిగారికి థ్యాంక్యూ.. మమ్మల్ని కలిపి ఒక సినిమా తీసినందుకు. రాజమౌళి గురించి చెప్పాలంటే ఒక స్టేజ్ సరిపోదు` అని చెప్పారు రామ్‌చరణ్. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్, రాజమౌళి టీమ్‌కి, `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌కి, నిర్మాత దానయ్యకి, కీరవాణికి ధన్యవాదాలు తెలిపారు రామ్‌చరణ్. అంతేకాదు విజయ్, సూర్య, అజిత్, శివకార్తికేయలపై ప్రశంసలు కురిపించారు చరణ్. వారి సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే చెన్నైలోనూ తెలుగు ఆడియెన్స్ సందడి చేయడం విశేషం. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు భారీగా తరలివెళ్లడం విశేషం.
