- Home
- Entertainment
- RRR Pre Release Event: ఎన్టీఆర్ ఇండియన్ సినిమా చేసుకున్న అదృష్టం.. చరణ్ అరుదైన నటుడుః రాజమౌళి ఎమోషనల్
RRR Pre Release Event: ఎన్టీఆర్ ఇండియన్ సినిమా చేసుకున్న అదృష్టం.. చరణ్ అరుదైన నటుడుః రాజమౌళి ఎమోషనల్
తారక్‌కి, చరణ్‌కి ఓ పొజీషియన్‌కి కోరిక ఉంది. కానీ ఇద్దరి దారులు వేరు. తారక్ ఆంబీషియస్, చరణ్ సెక్యూర్డ్. ఈ ఇద్దరు బోల్ట్ లు, ఇద్దరు అపోజిట్, ఒకరు నార్త్ అయితే, మరొకరు సౌత్, వారిద్దరు ఓ మ్యాగ్నెట్‌లా వచ్చి `ఆర్ఆర్‌ఆర్`కి అతుక్కుపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

`ఎన్టీఆర్ నటుడిగా ఉండటం, అది తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు ఇండియన్ సినిమా చేసుకున్న అదృష్టం` అని అన్నారు రాజమౌళి. తారక్ తాలుకూ ప్రేమని తట్టుకోవడం కష్టమన్నారు. సునామీలా వచ్చి మీద పడిపోతాడని ప్రశంసలు కురిపించారు రాజమౌళి. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియా మోర్రీస్ కథానాయికలుగా, అజయ్ దేవగన్, శ్రియా కీలక పాత్రలు పోషించారు.
సోమవారం సాయంత్రం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి ఎన్టీఆర్, చరణ్‌లపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ గురించి చెబుతూ, ఎన్టీఆర్ తనతో ఎప్పుడూ దెబ్బలాడుతుంటాడని తెలిపారు. అంతేకాదు ఎన్టీఆర్‌కి టైమ్ సెన్స్ లేదని ఆరోపించారు. సెట్‌కి ఏడుగంటలకు రావాలంటే ఆరు గంటలకే వస్తాడని, అలాంటప్పుడు ఏమనాలి టైమ్ సెన్స్ లేదనే చెప్పాలంటూ సెటైర్లు వేశారు.
పాత్ర కోసం ఎంత ఎనర్జీ పెడతాడో మాటల్లో చెప్పలేం. ఆయనకు ఇలా రండి, ఇలా చేయండని చెప్పాల్సిన అవసరం లేదు. నేను మనసులో అనుకున్న యదాతథంగా చేసి చూపిస్తాడు. మా ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ అలాంటిది. అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడి అదృష్టం కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ అదృష్టం మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చేసుకున్న అదృష్టం` అని తెలిపారు రాజమౌళి.
మూడేళ్లపాటు ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటే ఉండిపోయినందుకు తారక్‌కి ధన్యవాదాలు తెలిపారు. `ఆర్‌ఆర్‌ఆర్`నే కలగంటూ, ఈ సినిమానే తింటూ ఊపిరిగా పీల్చుకుంటూ ఉన్న తారక్‌కి ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి. చరణ్, తారక్ తనకు దొరికిన రెండు బాణాలని, అవి డైరెక్ట్ గా గుండెల్లో గుచ్చుకుంటాయని చెప్పారు.
రామ్‌చరణ్ గురించి చెబుతూ, చరణ్ నా హీరో. చరణ్ తన స్టూడెంట్ అని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు ఆయన్నుంచి చాలా నేర్చుకున్నట్టు చెప్పారు రాజమౌళి. అయితే ఆ విషయం ఇప్పటి వరకు ఆయనకు కూడా చెప్పలేదని తెలిపారు. ఏదైనా ఒక పని గురించి వెళ్తున్నప్పుడు ఎలా చేయాలని మదనపడే మనస్తత్వం నాది. కానీ చరణ్ అలా కాకుండా మెడిటేషన్ లాగా, కంప్లీట్ వైట్ పేపర్‌లాగా, ఇప్పుడు నేను ఏం చేయాలి, మీకు ఏం కావాలి, ఎంత బాగా చేయాలని ఆలోచించే వ్యక్తి చరణ్. ఇలాంటి క్వాలిటీ నేనిప్పటి వరకు ఎవరి వద్ద చూడలేదు. తన గురించి తాను ఇంత సెక్యూర్‌గా ఫీలైన నటుడిని నేనిప్పటి వరకు చూడలేదని చెప్పారు రాజమౌళి.
తారక్‌కి, చరణ్‌కి ఓ పొజీషియన్‌కి కోరిక ఉంది. కానీ ఇద్దరి దారులు వేరు. తారక్ ఆంబీషియస్, చరణ్ సెక్యూర్డ్. ఈ ఇద్దరు బోల్ట్ లు, ఇద్దరు అపోజిట్, ఒకరు నార్త్ అయితే, మరొకరు సౌత్, వారిద్దరు ఓ మ్యాగ్నెట్‌లా వచ్చి `ఆర్ఆర్‌ఆర్`కి అతుక్కుపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో నేను లక్కీ పర్సన్. మోస్ట్ హ్యాపీయెస్ట్ డైరెక్టర్ టుడే` అంటూ ఎమోషనల్ అయ్యారు.