ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న గ్యాప్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ కోసం దదాపు మూడేళ్లు కష్టపడిన యంగ్ టైగర్.. ఆ చిత్రం పూర్తి కావడంతో విశ్రాంతి కోసం చిన్నవిరామం తీసుకున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న గ్యాప్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ కోసం దదాపు మూడేళ్లు కష్టపడిన యంగ్ టైగర్.. ఆ చిత్రం పూర్తి కావడంతో విశ్రాంతి కోసం చిన్నవిరామం తీసుకున్నారు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కాబోతోంది. 

ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తాడు. ఎన్టీఆర్ లైనప్ లో ఈ రెండు చిత్రాలు ఉన్నాయి. తాజా సమాచారం మేరకు ఎన్టీఆర్ ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళంలో అవార్డు విన్నింగ్ దర్శకుడు వెట్రి మారన్ కి ఎన్టీఆర్ ఓకే చెప్పారట. 

వెట్రి మారన్ చెప్పిన కథకి ఎన్టీఆర్ థ్రిల్ అయినట్లు తెలుస్తోంది. ఇంటెన్స్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందట. ఓ తెలుగు నిర్మాత ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. 

వెట్రి మారన్ తమిళంలో సహజ సిద్దమైన కథలకు పెట్టింది పేరు. ఆయన తెరకెక్కించిన అసురన్, ఆదుకాలం చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన నటుడు వెట్రి మారన్ దర్శకత్వంలో నటిస్తే అవార్డుల వర్షం కురుస్తుందని అభిమానులు అంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి.