మళ్లీ తారక్, చరణ్ ఫ్యామిలీలు కలిశాయి... ఎందుకో తెలుసా..?

First Published 6, May 2018, 11:29 AM IST
NTR Marraige Anniversery celebrations with charan and upasana
Highlights

మళ్లీ తారక్, చరణ్ ఫ్యామిలీలు కలిశాయి

 

నందమూరి, మెగా ఫ్యామిలీలు హీరోలు ఎప్పుడు ఎక్కడ కలిసిన ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉంటుంది. ఇప్పుడు మన టాలీవుడ్ హీరోల తీరు మారింది ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉంటున్నారు. ఇటీవల తారక్, చెర్రీ, మహేశ్ బాబు నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు కలుసుకున్నారు. ఉపాసన, నమ్రత కూడా ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య చక్కటి మైత్రి ఉంది. మొదటి నుంచి వీరిద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి రాజమౌళి డైరెక్షన్లో కూడా నటిస్తున్నారు.

శనివారం తారక్-లక్ష్మీప్రణతి ఏడో వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వీరి మార్యేజ్ యానివర్సరీకి చెర్రీ-ఉపాసన దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొణిదెల వారి దంపతుల సమక్షంలో నందమూరి కపుల్ కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ప్రణతి గర్భవతి. కాగా.. వారి పెద్ద కుమారుడు అభయ్ రామ్‌ను ఉపాసన మీద కూర్చోబెట్టుకుని, ప్రణతి పక్కన కూర్చున్న ఫొటోను చెర్రీ వైఫ్ షేర్ చేసింది. వారిద్దరి వెనుకే చరణ్ భుజంపై తారక్ చెయ్యి వేసి నిలబడి ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోతోపాటు తారక్ కుమారుడు ఐ వానా ఫాలో ఫాలో యూ.. పాటను పాడుతున్న ఫొటోను ఉపాసన ట్వీట్ చేసింది. ఉపాసన చేసిన ఈ రెండు ట్వీట్లను చూసి ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌తోపాటు మూవీ లవర్స్ ని మైమరిపించారు.

loader