ఆర్.ఆర్.ఆర్ లో నటనతో ఎన్టీఆర్ నెక్ట్స్ లెవిల్ కు వెళ్లారు. ఆ క్రమంలో   బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్సి నిమాలలో ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఆ సినిమా టైటిల్..

మన హీరోలను హిందీ సినిమాల్లో తీసుకోవటం అనేది కామన్ గా మారుతోంది. తాజాగా సల్మాన్ ఖాన్ చిత్రంలో వెంకటేష్ కీ రోల్ చేస్తూండగా, రామ్ చరణ్ కొద్ది సేపు కనపడనున్నారు. అలాగే మరి కొన్ని హిందీ ప్రాజెక్టులలో కూడా ప్రభాస్ వంటి స్టార్స్ ని తీసుకునే దిసగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ ని ఓ హిందీ సినిమాకు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందుతున్న సమాచారం మేరకు .. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) సినిమాలలో ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఆ సినిమా టైటిల్ వార్ 2. వార్ (War) సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థ ఇటీవల తమ పఠాన్ సినిమాలోకి టైగర్ (Ek Tha Tiger, Tiger Zinda Hai) సిరీస్ లోని సల్మాన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక స్పై యూనివర్స్ ని క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు వార్ 2 ని ప్రకటించి స్పై యూనివర్స్ లోకి హృతిక్ ని కూడా తీసుకు రాబోతున్నారు. ఆ సినిమాలోకి సౌత్ మార్కెట్ కోసం ఎన్టీఆర్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇక హృతిక్ సినిమాలకు సౌత్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. ధూమ్ 2, క్రిష్, సినిమాలతో హృతిక్ సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీంతో ఈ హీరో నటించిన యాక్షన్ మూవీస్ తెలుగులో కూడా డబ్ రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం హృతిక ఫైటర్ (Fighter) అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) డైరెక్టర్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ దర్శకుడు పఠాన్ (Pathaan) మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. గతంలో ఈ దర్శకుడు, హృతిక్ తో కలిసి రెండు సినిమాలు తెరకెక్కించాడు. బ్యాంగ్ బ్యాంగ్, వార్.. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ టైగర్ 3 ని తెరకెక్కిస్తుంది. మనీష్ శర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. టైగర్ 3 కి కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కబోతుంది అంటూ తెలియజేశారు. ఇక వార్ ఫస్ట్ పార్ట్ ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయగా, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.