హీరోలు సిక్స్ ప్యాక్‌ చేయడం సినిమాకి స్పెషల్‌ ఎఫెక్ట్. బాలీవుడ్‌ హీరోలు సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తుంటా. తెలుగు హీరోలు కూడా అందుకు తక్కువ కాదని నిరూపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సైతం సిక్స్ ప్యాక్‌లో కనువిందు చేశారు. ఆయన ఇప్పటికే `టెంపర్‌`లో ఓ సారి సిక్స్ ప్యాక్‌లో మెప్పించాడు. 

రెండేళ్ళ క్రితం మరోసారి మెప్పించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన `అరవింద సమేత`లో ఎన్టీఆర్‌ మరోసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించారు. ఈ సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్‌ చేశారు. అందుకోసం ఎన్టీఆర్‌ పాపులర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దబ్బూ రత్నాని వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోని పంచుకున్నారు తారక్‌. జిమ్‌లో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరోసారి ఎన్టీఆర్‌ సిక్స్ ప్యాక్‌కి శెభాష్‌ చెబుతున్నారు. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. త్వరలో తన అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. మరో నాలుగు రోజుల్లో దసరా కానుకగా ఈ చిత్రంలోని తన కొమురంభీమ్‌ పాత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. `రామరాజు ఫర్‌ భీమ్‌` పేరుతో ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు.